Pratidhwani On Dharani Troubles : ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఎంతోకాలంగా వేధిస్తోన్న ధరణి సమస్యల పరిష్కారం దిశగా కీలకనిర్ణయం తీసుకుంది. తహశీల్దారు, ఆర్డీవో, కలెక్టర్లకు అధికారాల బదిలీ, ప్రతిమండలానికి ప్రత్యేక బృందాలతో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ 9వ తేదీ వరకు ఎక్కడి భూ రికార్డుల సమస్యలు అక్కడే చక్కబెట్టేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇందుకు సంబంధించి అధికార హోదాల మధ్య పని విభజనపై కూడా స్పష్టమైన మార్గ నిర్దేశకాలు ఇచ్చారు. ఇక్కడితో అయినా రాష్ట్ర ప్రజల భూమి రికార్డుల కష్టాలు తీరతాయా? స్పెషల్ డ్రైవ్ అనంతరం ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఆ విషయంలో ధరణి కమిటీకి రెవిన్యూ వ్యవహారాల నిపుణులు , రైతు సంఘాలు ఏం సూచనలు చేస్తున్నారు? రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల వరకు పెండింగ్‌లో ఉన్న ధరణిదరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది ప్రభుత్వం. ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.