ETV Bharat / state

ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు రాజకీయాలు : ప్రత్తిపాటి పుల్లారావు - Prathipati Sharat Arrested

Prathipati Pullarao Fires on YSRCP : ఓటమి భయంతో తన కుమారుడిపై అక్రమ కేసు పెట్టారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. సంబంధమే లేని కంపెనీ వ్యవహారంలో కేసు బనాయించి తమ కుటుంబంపై బురద జల్లడం దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రత్తిపాటి కుమారుడు శరత్​ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు సీపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.

Prathipati Pullarao
Prathipati Pullarao
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 9:36 AM IST

ప్రత్తిపాటి శరత్‌ అరెస్ట్‌ను ఖండించిన టీడీపీ శ్రేణులు

Prathipati Pullarao Fires on YSRCP : ఓటమి భయం నిలువెల్లా కమ్మేసిన ముఖ్యమంత్రి జగన్ రోజురోజుకీ మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. రాజకీయ క్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏ కంపెనీలో డైరెక్టర్‌గా గానీ, కనీసం షేర్ హోల్డర్ కూడా లేని తన కుమారుడిపై కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘనల కేసులు పెట్టడమే అందుకు తార్కాణమని ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్

Prathipati Pullarao Comment AP Govt : కంపెనీలో లేని, కంపెనీలతో సంబంధం లేని వ్యక్తికి జీఎస్టీ ఎగవేతలకు సంబంధం ఏమిటని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. గతంలోనూ ఇలానే బురద జల్లాలని చూశారని, ఇప్పుడు మరోసారి అదే పన్నాగం పన్నినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. తమకు సంబంధం లేని కంపెనీ పేరుతో దుష్ప్రచారానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఏపీఎస్‌డీఆర్‌ఐ ద్వారా తప్పుడు కేసులు బనాయించారని, వాటికి భయపడేది లేదని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

Prathipati Sharat Arrested : తన కుమారుడిని స్టేట్‌మెంట్ కోసమని పిలిచి అదుపులోకి తీసుకున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వెంటనే అధికారపక్షం తమ అనుకూల మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, చట్టపరంగానే దీటుగా ఎదుర్కొంటామని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

చిలకలూరిపేటలో తనపై పోటీకి వైఎస్సార్సీపీకి ధీటైన అభ్యర్థి దొరకట్లేదని, ఎన్నికలకు ముందే తన గెలుపు ఖాయమైందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో మంత్రి రజిని వైఫల్యాలే వైఎస్సార్సీపీ ఓటమికి బాటలు పరిచాయని తెలిపారు. అదే సమయంలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పార్టీని బలోపేతం చేసుకుని ఎన్నికలకి ముందే గెలుపు ఖాయమే బలమైన స్థాయికి చేరుకున్నామని, ఆ ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఈ కేసుల రాజకీయానికి తెగబడ్డారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

ఇలాంటి కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయాలు, దాడులు, అరెస్టుల్ని మాత్రం ఎక్కడా చూడ లేదని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. తన కుమారుడికి కనీసం ముందస్తు నోటీసులు కూడా లేకుండా అదుపులోకి తీసుకున్నారని వాపోయారు. తెలుగుదేశం పార్టీ తరఫున తనకు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి సీటు ఖరారు చేసిన రోజు సాయంత్రమే, ఏపీఎస్‌డీఆర్ఐ కేసు నమోదు చేసిందని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

టీడీపీ-జనసేన విన్నింగ్‌ టీమ్‌ - వైఎస్సార్సీపీ చీటింగ్‌ టీమ్‌ : చంద్రబాబు

TDP Leaders Condemn Prathipati Sarath Arrest : ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ( Prathipati Sarath Arrest) అరెస్ట్‌పై చిలకలూరిపేట టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెట్టి అరెస్టులతో వేధిస్తున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. చిలకలూరిపేటలో జాతీయ రహదారిపై పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కంపెనీ వ్యవహారాల్లో ఎలాంటి సంబంధం లేకపోయినా అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. విచారణ పేరుతో పిలిచి, కనీసం నోటీసులు ఇవ్వకుండా శరత్‌ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

కుట్ర రాజకీయాలు మానుకోవాలని ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినదించారు. తక్షణమే శరత్‌ను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులతో కుమ్మక్కై అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాటి పుల్లారావును ఢీకొట్టలేకనే ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. శరత్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని అన్నారు.

అమరావతిని విచ్ఛిన్నం చేసేలా వైఎస్ఆర్సీపీ కుట్రలు- భూసేకరణ ప్రకటన ఉపసంహరణకు కసరత్తు

ఎన్నికల సమరానికి సై - టీడీపీ, జనసేన 'జెండా' సభకు సర్వం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.