Prathipati Pulla Rao Spiritual meeting With Muslims : రాష్ట్రంలో ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వమే రక్షగా ఉంటుందని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపై వైసీపీ విషప్రచారం చేస్తోందని విమర్శించారు. ఈరోజు చిలకలూరిపేట ఎస్ఎంఎస్ గార్డెన్స్‌లో మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీతో రిజర్వేషన్ల రద్దు, క్రైస్తవ, ముస్లిం ప్రార్థనాస్థలాలకు ముప్పు, అలాగే మైనార్టీలకు రక్షణ ఉండదని వైసీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు తిప్పికోట్టాలన్నారు. ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీతో కలసి సాగుతోన్న ముస్లిం మైనార్టీల్లో ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం తమపై ఉందన్నారు.
ముస్లింలకు జగన్ చేసిందేంటి ? - మైనార్టీల మనోభావాలు ఎలా ఉన్నాయి ? - What CM Jagan did to minorities
వైసీపీ విష ప్రచారానికి ఫుల్‌స్టాప్ : వైసీపీ దుష్ప్రచారాలు, విష ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ గత అయిదేళ్లుగా ఎవరితో కలసి నడిచిందో చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ సమాజంలో ముస్లింలు, క్రైస్తవులు అంతర్భాగమన్న ఆయన వారి ప్రయోజనాలకు ఎవరు విఘాతం కలిగించలేరన్నారు. ఆ నిజాలన్నీ దాచి ముస్లిం మైనార్టీల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, దాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. ఎన్‌ఆర్సీ, సీఏఏకి పార్లమెంట్‌లో ఎవరు ఆమోదం తెలిపారో వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. ఎన్‌ఆర్సీ, సీఏఏకి లోక్‌సభలో, రాజ్యసభలో వైసీపీ మద్దతిచ్చిందా లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని మైనార్టీలు ధైర్యంగా ఉండాలి : లౌకిక భావన, సమజం సామరస్యపూర్వక వాతావరణం ముందు తమకి పదవులు గడ్డిపోచతో సమానమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మైనార్టీలు అంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం విషప్రచారం చేస్తున్న వారంతా స్వార్థం కోసం వైసీపీతోనే ఉంటారు తప్ప ముస్లిం మైనార్టీలపై ప్రేమ ఉండి కాదన్నారు. కూటమి శ్రేణులంతా ఎక్కడికక్కడ వైసీపీ విషప్రచారాల్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ రాష్ట్రంలో తప్పుడు ప్రచారానికి, పుకార్లకు, గాసిప్స్‌కి, షికార్లకు చిలకలూరిపేట పుట్టినిల్లుగా మారిందన్నారు. అటువంటి వారు చిలకలూరిపేటలో ఉన్నారని మండిపడ్డారు.
కూటమిపై వైసీపీ అపోహాలు, పుకార్లు సృష్టిస్తోంది : అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ, వైసీపీలో అవమానాలు, దొంగచాటు వ్యవహారాలు తప్ప మరేం లేవన్నారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటునే జగన్ వారినే నిలువునా మోసం చేశారన్నారు. బీజేపీతో తెలుగుదేశం పొత్తుపై వైసీపీ అపోహలు, పుకార్లు సృష్టించాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ ఐదేళ్లు జగన్‌రెడ్డి తన కేసుల కోసమో?, జైలుకు వెళ్లకుండా ఉండటానికో? లేక ప్రత్యేక పరిస్థితుల వల్లనో బీజేపీతో బంధాన్ని కొనసాగించారని తెలిపారు. అందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని బిల్లులకు మద్దతిచ్చారని తెలిపారని గుర్తుచేశారు. అవన్నీ గమనించే వైసీపీలో ఉండలేక తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. ముస్లిం సోదరులు ఎవరు కూడా ఫేక్ వీడియోలు నమ్మొద్దని తెలిపారు. రిజర్వేషన్లు మార్చబోమని బీజేపీ పెద్దలంతా చెప్పిన విషయాన్నీ గమనించాలని ఇక్బాల్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్సీపీ పాలనలో వ్యవస్థలు కుప్పకూలాయి - మహమ్మద్ ఇక్బాల్ - TDP Leader Mohammed Iqbal
ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు - స్వయంగా వడ్డించిన బాలకృష్ణ - MLA Balakrishna Gives IFTAR Party