Prathidwani Debate on YSRCP Govt Cheating Dalits: నా ఎస్సీలు అని జగన్ దళితులపై ప్రేమ ఒలకపోస్తుంటారు. అయితే అది నిజమైన ప్రేమేనా ? 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ సీఎం అయ్యాకా దళితులకు అదనంగా ఏం మేలు జరిగింది ? దళితులపై దాడులు ఆగాయా ? దళితులకు పథకాలు పెరిగాయా ? దళితుల ఆత్మగౌరవం పెంచారా ? ఆర్థికంగా ఉన్నత స్థితిని కల్పించారా ? ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను సద్వినియోగం చేశారా?
దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షించారా ? జగన్ పార్టీకి ఓటేయటానికి దళితులు సిద్ధంగా ఉన్నారా ? జగన్‌ను సీఎం పదవి నుంచి దించాలా ? లేక మరోసారి ఆశీర్వదించాలా ? ఇదీ నేటి ప్రతిధ్వని. నేటి చర్చలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నా ఎస్సీలు అంటూ సీఎం దళితులపై ఎంతో కారుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కానీ జగన్ సీఎం అయ్యాకా దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయి. అధికార వైసీపీ వాళ్లే దళితులపై దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ పోలీస్ యంత్రాంగమే దళితులను వేధిస్తోందని అనేక ఉదంతాలు చూశాం. దీనిపై సీఎం ఏ రోజూ వాళ్లని పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. దీనిపై ఏనాడూ సీరియస్‌గా రివ్యూ చేయలేదు.
కూటమి చేతిలో జగన్ ఓటమి ఖాయమా?- అందుకే ప్రలోభాల పర్వం ప్రారంభించారా?
ఉమ్మడి ఏపీలో కూడా సీఎం అయ్యేంతగా 151 సీట్లతో భారీ మెజార్టీని వైసీపీకి ఇచ్చారు. కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీలు, పంచాయతీలు అన్నీ వారికే కట్టబెట్టారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పని చేస్తోంది. దళితుల పట్ల అమానవీయంగా వ్యవహరించే పోలీసుల విషయంలో వైసీపీ పెద్దలు చర్యలు తీసుకోవట్లేదు. ఇంత అధికారం ఇస్తే వారు దళితులకు ఏం చేశారు ? ఓటు కోసం వచ్చే వైసీపీ అభ్యర్థులను దళితులు ఏమని ప్రశ్నించాలి ? ఈ ఐదేళ్లలో దళితులకు ఏం మేలూ జరగలేదు.