Crucial Factors in US Presidential Polls : సాధారణంగా పోరాటాలు రెండు రకాలుగా సాగుతాయి. కొన్నింట్లో హోరాహోరీగా మొదలై రోజులు గడిచే కొద్దీ విజేతలు ఎవరో స్పష్టంగా తెలిసి పోతోంది. రెండోది అలా కాదు. మొదట ఏకపక్షంగా కనిపించినా రోజులు గడిచేకొద్దీ పోటీ చిక్కబడుతుంది. ఫలితాల నాడి అంతు చిక్కదు. ప్రపంచం ఆసక్తి, ఉత్కంఠ కలగలిపి ఎదురు చూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోదే జరుగుతోంది. ప్రారంభంలో బైడెన్ ట్రంప్ మధ్య ఏకపక్షంగా కనిపించినా కమలాహారిస్ రాకతో సమరం స్వరూపమే మారి పోయింది. ఆధిక్యాల అంకెలు అటుఇటు అవుతూ ఆఖరివారానికి చేరే సరికి మరింత హోరాహోరీగా మారాయి. ఇప్పుడు ప్రపంచంలోని అందరి దృష్టీ అమెరికా ఎన్నికలపై పడింది. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షపీఠాన్ని దక్కించుకునేది ఎవరు? అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. మరి ఈ పోరాటంలో గెలిచేది ఎవరు? ఆ విజేతల్ని నిర్ణయించబోతున్న అంశాలు ఏమిటి? ఆ ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతోంది?
అమెరికాలో ఎన్నికలు - మరి ఈ పోరాటంలో గెలిచేది ఎవరు? - FACTORS IN US PRESIDENTIAL POLLS
ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న అమెరికా ఎన్నికలు - మరి ఈ పోరాటంలో గెలిచేది ఎవరు? ఆ విజేతల్ని నిర్ణయించబోతున్న అంశాలు ఏమిటి?
![అమెరికాలో ఎన్నికలు - మరి ఈ పోరాటంలో గెలిచేది ఎవరు? PRATHIDWANI DEBATE ON US POLLS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2024/1200-675-22785092-thumbnail-16x9-usa-elections.jpg?imwidth=3840)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 29, 2024, 12:34 PM IST