Prathidwani Debate on CM Jagan Promises to BCs: జనాభాలో సగానికి పైగా బడుగు బలహీనవర్గాల వారే ఉన్నారు. 140 బీసీ కులాలు ఉన్నాయి. సీఎం అవకముందు జగన్ వారికి ఏవేం వాగ్దానాలు చేశారు? ఐదేళ్ల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నింటిని పరిపూర్తి చేశారు? దామాషా ప్రకారం పదవుల్లో వాటా ఇచ్చారా? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు? వైసీపీ పాలనలో ఎంతమంది బీసీలు హత్యకు గురయ్యారు? దోషులకు ఎలాంటి శిక్షలు విధించారు? ఐదేళ్లలో 75 వేల కోట్లు ఖర్చు చేస్తామన్న బీసీ సబ్‌ప్లాన్ సంగతేంటి? చేతివృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపారా? అసలు జగన్ ఐదేళ్ల పాలనపై బీసీలు ఏం అంటున్నారు? ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సీఎం అవకముందు జగన్ బీసీలకు ఎలాంటి హామీలు ఇచ్చారు సీఎం అయిన ఐదేళ్లలో ఎన్ని పూర్తి చేశారని చేతివృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి భాస్కరయ్య( Handicrafts Association State Secretary Bhaskaraiah) ప్రశ్నించారు. బీసీ సబ్‌ప్లాన్ కింద ఏటా 15 వేల కోట్లకు తక్కువ కాకుండా ఐదేళ్లలో 75 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తామన్న జగన్ ఆ హామీని మరిచారని అన్నారు. చేయూత ద్వారా నాలుగు విడతల్లో ఒక్కో బీసీ మహిళకు 75వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం చేస్తామని జగన్ మాటిచ్చారు. మరి వాటి అమలు సంగతేంటని అన్నారు. చేతివృత్తిదారుల బతుకుల బాగుకు ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఏం చేసింది? వివిధ వృత్తిదారులు ఏమంటున్నారు? రాష్ట్రంలో ప్రధాన చేతివృత్తిలపై ఎంతమంది ఆధారపడి ఉన్నారు? ఈ ఐదేళ్లలో వారికి గతంకంటే అదనంగా ఏం మేలు జరిగిందని భాస్కరయ్య అన్నారు.
జగన్ సీఎం అయిన ఈ ఐదేళ్లలో బీసీలపై అనేక దాడులు జరిగాయని పద్మశాలీ సంఘం నేత లక్ష్మీనరసింహులు (Padmasali Community Leader Lakshminarasimhulu) అన్నారు. బీసీలపై ఎక్కడెక్కడ దాడులు జరిగాయి? బీసీల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందిని ప్రశ్నించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఈ ప్రభుత్వం తగ్గించింది అని బీసీ సంఘాలు అంటున్నాయి. ఎందుకు తగ్గించారని అన్నారు. బీసీలను రాజకీయంగా ఈ ప్రభుత్వం ప్రోత్సహించిందా? ఐదేళ్ల జగన్ పాలనలో నామినేటెడ్ పదవుల భర్తీలో దామాషా ప్రకారం బీసీలకు వాటా లభించిందా? బీసీ కార్పోరేషన్ల స్థితిగతులు ఎలా ఉన్నాయి? 8) రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం ఆవశ్యకత ఏంటి? బీసీల్లోని మెజార్టీ వర్గాలు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?