ETV Bharat / state

యుద్ధప్రాతిపదికన ప్రకాశం బ్యారేజ్​ గేట్ల పనులు- రికార్డు టైమ్‌లో కౌంటర్ వెయిట్ల బిగింపు - PRAKASAM BARRAGE GATES WORKS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 8:00 AM IST

Prakasam Barrage Gates Repair Works Speed Up in Vijayawada : ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మధ్య చిక్కుకున్న బోట్లను తొలగించేందుకు ఇంజినీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కీలకమైన 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను కన్నయ్య నాయుడు సారథ్యంలో అధికారులు విజయవంతంగా అమర్చారు. పైనుంచి జోరు వర్షం కురుస్తున్నా, కింద లక్షన్నర క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నా తాడు, క్రేన్లు సాయంతో రంగంలోకి దిగి సాహసోపేతంగా పనిచేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.

PRAKASAM BARRAGE GATES WORKS
PRAKASAM BARRAGE GATES WORKS (ETV Bharat)

Prakasam Barrage Gates Repair Works Speed Up in Vijayawada : విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సాగు ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు కన్నయ్యనాయుడు మార్గదర్శకంలో గేట్ల మార్పిడి ప్రక్రియ వేగంగా సాగుతోంది. ‍‌‍‌‌అపార అనుభవమున్న బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థకు ప్రభుత్వం మరమ్మతుల పనులు అప్పగించింది. ఈ నెల 5 న ( Sep 5) ఉదయం 10 గంటలకు పనులు ప్రారంభించగా తొలి రోజే 69 గేటు కౌంటర్ వెయిట్ ను భారీ క్రేన్ల సాయంతో తొలగించారు. మరుసటి రోజూ రేయింబవళ్లు పనిచేసి మరో కౌంటర్ వెయిట్ ను తొలగించారు.

కౌంటర్ వెయిట్ల ఏర్పాటు : హైదరాబాద్ నుంచి భారీ వాహనాల్లో తీసుకువచ్చిన నాలుగున్నర టన్నుల బరువున్న3 కౌంటర్ వెయిట్లను 67, 69వ గేట్ల వద్దకు తరలించి బిగించారు. కేవలం 48 గంటల్లోనే దెబ్బతిన్న రెండు గేట్ల కౌంటర్ వెయిట్లను తొలగించడం సహా కొత్త వాటిని విజయవంతంగా అమర్చేశారు. క్రేన్ల సహాయంతో కౌంటర్ వెయిట్లపై కూర్చున్న ఇంజినీరింగ్ సిబ్బంది కాంక్రీట్ ను నింపుతున్నారు. కాంక్రీట్​ను రోజంతా ఉంచిన తర్వాత గట్టి పడిన అనంతరం నూతన కౌంటర్ వెయిట్ల సాయంతో 67,68 గేట్లను ఎత్తడం, దించడం చేయనున్నారు. దెబ్బతిన్న 70 వ గేట్ వద్ద కౌంటర్ వెయిట్‌ను మార్చి అమరుస్తామని కన్నయ్యనాయుడు తెలిపారు.

చురుగ్గా ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు - రేయింబవళ్లు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ - Prakasam Barrage Gates Works

భారీ పడవలు ఢీకొట్టినా తట్టుకునేలా : ప్రస్తుతం పనులు కొనసాగుతున్నందున బ్యారేజీలో 5 గేట్లను మూసివేశారు. భారీ వర్షాలు కురిస్తే ఎగువ నుంచి ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నందున ముంపు ముప్పు లేకుండా గేట్ల మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ పడవలు ఢీకొట్టినా తట్టుకునేలా కొత్త కౌంటర్ వెయిట్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

విపత్తు నుంచి బయటపడేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా - ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: సీఎం చంద్రబాబు - CM CBN on Flood Relief Measures

అడ్డుపడిన పడవలు తొలగింపు : శరవేగంగా గేట్ల మరమ్మతులు చేస్తుండటంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులు, సిబ్బందిని అభినందించారు. గేట్లను పడవలు ఢీకొట్టడంపై కుట్రకోణం ఉందన్న ఆయన సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులెంతటివారినైనా శిక్షిస్తామన్నారు. రెండ్రోజుల్లోనే రెండు గేట్లకు మరమ్మతులు పూర్తి చేసిన ఇంజినీర్లు ఇవాళ 70 వ గేటు కౌంటర్ వెయిట్ ఏర్పాటు సహా వాటిలో కాంక్రీట్ నింపే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. సోమవారం గేట్ల వద్ద అడ్డుపడిన పడవలను తొలగించనున్నారు.

ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు - రంగంలోకి కన్నయ్యనాయుడు - Damage Gates Repair Work Started

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.