Power Problems in Telangana : ఎండల తీవ్రత వల్ల పల్లెలు, పట్లాల్లో విద్యుత్తు, నీటి వినియోగం పెరిగింది. బోర్లు, బావులు, జలాశయాలతోపాటు భూగర్భ నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. పెరిగిన ఎండలతోపాటు రోజురోజుకూ విద్యుత్తు డిమాండ్ అధికమవుతోంది. ఈ పరిస్థితుల్ని గుర్తించిన ప్రభుత్వం కరెంటు, నీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్త్తు వ్యవస్థల సామర్థ్యం ఎంత? కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాలంటే ఎలాంటి ప్రణాళికలు అవసరం? కరెంటును, నీటిని వాడుకోవటంలో ఎలాంటి పొదుపు పాటించాలి?
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కరెంటు, నీటి కష్టాలను అథిగమించటంలో ప్రభుత్వం పాత్రేంటి? ఏప్రిల్ నుంచి జూన్ వరకు బోర్లు, బావుల నుంచి తాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలంటే ప్రజలకు ఏఏ అంశాలపై అవగహన కల్పించాలి? పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు, తాగునీరు, సాగునీటి సరఫరాలు చేసేటప్పుడు కరెంటు కష్టాలు రాకుండా చూడాలంటే ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టాలి? పౌరుల బాధ్యతేంటి? ఇదీ నేటి ప్రతిధ్వని.