ETV Bharat / state

విద్యుత్​ వినియోగదారులకు గుడ్​న్యూస్​ - కరెంటు బిల్లుల చెల్లింపుల్లో యూటర్న్! - Power Bills Payment Process - POWER BILLS PAYMENT PROCESS

Current Bills: రాష్ట్ర ప్రజలకు బిగ్​ అలర్ట్​. విద్యుత్​ బిల్లుల చెల్లింపులలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇకపై ఆ పద్ధతిలోనే బిల్లులు చెల్లింపులు చేయొచ్చని అధికారులు వివరించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Current Bills
Current Bills (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 10:52 AM IST

Power Bills Payment Process: ఒకప్పుడు ఫోన్​ పే, గూగుల్​ పే, పేటీఎం వంటి థర్డ్​ పార్టీ యాప్స్​ ద్వారా ప్రజలు కరెంటు బిల్లులు చెల్లించేవారు. అయితే ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు జులై 1 నుంచి ఆయా సంస్థలు విద్యుత్‌ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయి. డిస్కం వెబ్‌సైట్‌ లేదా టీజీఎస్పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌లో మాత్రమే కరెంటు బిల్లులు చెల్లించాలని టీడీఎస్‌పీడీసీఎల్‌ వినియోగదారులకు సూచించింది. దీంతో వినియోగదారులు జులై 1 నుంచి తెలంగాణ డిస్కం అధికారిక వెబ్​సైట్​ లేదా యాప్​ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే తాజా నిర్ణయం ప్రకారం.. కరెంటు బిల్లులు చెల్లించేందుకు చిక్కులు వీడాయి. విద్యుత్తు బిల్లులను గతంలో మాదిరిగా మొబైల్‌ యూపీఐ యాప్ ద్వారా చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు.

కరెంటు బిల్లుల చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్దపీట వేసే చర్యల్లో భాగంగా బిల్లు చెల్లింపులన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌(Bharat Bill Payment System) ద్వారానే జరగాలని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(RBI) నిర్దేశించింది. చెల్లింపులన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్ సిస్టమ్‌ ద్వారానే జరగాలని ఆదేశించి, దానికి సంబంధించిన కొత్త నిబంధనలను జులై 1వ తేదీ నుంచి తీసువచ్చింది. ఇందులో భాగంగా భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను బిల్లర్లు యాక్టివేట్‌ చేసుకోవాలని తెలిపింది.

కరెంటు బిల్లు ఎలా కట్టాలని టెన్షన్​ పడుతున్నారా? - డోంట్​ వర్రీ - ఇలా చేస్తే చిటికెలో పేమెంట్​!

తాజాగా.. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్తు బిల్లుల చెల్లింపులను ఈజీ చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీసీపీడీసీఎల్‌లు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టం(బీబీపీఎస్‌)లో చేరాయి. డిస్కంలు బీబీపీఎస్‌లోకి రావడంతో.. కథ సుఖాంతమైంది. ఇక నుంచి బ్యాంకులు, ఫిన్‌టెక్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌లతోపాటు బీబీపీఎస్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారానూ బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని ఎన్‌పీసీఐకి చెందిన భారత్‌ బిల్‌ పే లిమిటెడ్‌(బీబీఎల్‌) సీఈవో నూపూర్‌ చతుర్వేది శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే.. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న టీజీఎస్పీడీసీఎల్‌ ఇప్పటికే ఫోన్‌ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది. మిగతా సంస్థలతోనూ చర్చిస్తున్నామని.. గూగుల్‌ పే, అమెజాన్‌ పే ద్వారానూ త్వరలోనే కరెంటు బిల్లులు చెల్లించవచ్చని ఓ అధికారి తెలిపారు. సో.. డిస్కమ్ అధికారిక​ వెబ్​సైట్​ ద్వారా మాత్రమే కాకుండా.. పాత పద్ధతిలోనూ యూపీఐ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించవచ్చు.

G-pay, Phonepe కట్ - వెబ్​సైట్ & యాప్ ద్వారా కరెంట్ బిల్లు ఎలా కట్టాలో మీకు తెలుసా ?

మీరు ఎన్ని యూనిట్ల కరెంట్ వాడారు? ఎంత ఛార్జ్ పడింది? - ఇలా తెలుసుకోండి!! - CURRENT BILL CALCULATOR IN TSSPDCL

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.