ETV Bharat / state

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ శాఖ ఇచ్చారంటే? - IAS POSTINGS IN ANDHRA PRADESH

తెలంగాణ నుంచి రిలీవ్ అయిన పలువురు ఐఏఎస్​లకు పోస్టింగ్ - వాణీ ప్రసాద్​కు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి - ఆమ్రపాలికి ఏ శాఖ ఇచ్చారంటే?

KATA AMRAPALI IN AP
IAS POSTINGS IN AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2024, 10:56 AM IST

IAS Amrapali Posting in AP : తెలంగాణ నుంచి రిలీవై, ఇటీవల ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసిన ఐఏఎస్‌ అధికారిణి కాటా ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా (చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్)గా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

తెలంగాణ నుంచి రిలీవై ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసిన వాణీ ప్రసాద్‌కు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, వాకాటి కరుణకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాధారణ పరిపాలన శాఖకు వాణీ మోహన్‌ : పురావస్తు శాఖ, మ్యూజియంల విభాగానికి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జి.వాణీ మోహన్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖలోని జీపీఎం అండ్‌ ఏఆర్‌ విభాగం ముఖ్య కార్యదర్శిగా నియమించారు.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని డీవోపీటీ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌ అధికారులను ఆదేశించింది. అయితే డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని ఐఏఎస్‌ అధికారులు క్యాట్‌తో పాటు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ రెండు చోట్లా వారికి ఎదురు దెబ్బే తగిలింది. దీంతో తెలంగాణ, ఏపీ సీఎస్​లు ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్​లను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రిలీవ్ చేసింది. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన ఐఏఎస్​లు సృజన, హరికిరణ్, శివశంకర్​లు ఏపీ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి రిపోర్టు చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్​లకు ఏపీ సర్కార్ తాజాగా పోస్టింగ్​లు కేటాయించింది.

తెలంగాణలో ఉన్నప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కీలక పోస్టుల్లో కొనసాగారు. ఆమ్రపాలి జీహెచ్​ఎంసీ కమిషనర్​గా, వాకాటి కరుణ మహిళా, శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా, రోనాల్డ్ రోస్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులుగా పని చేశారు.

ఐఏఎస్​పై ఈడీ ప్రశ్నల వర్షం - భూదాన్ భూముల స్కాంలో చిక్కుముడులు వీడినట్టేనా!

స్మితా సభర్వాల్​ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : ప్రొఫెసర్ కోదండరాం - Kodandaram fires on Smita Sabharwal

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.