Poor Meal For Government Hospital Patients at Nellore: ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారికీ మూడు పూటలా పౌష్ఠికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. నెల్లూరు జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, ఏరియా ఆసుపత్రిల్లోని పరిస్థితులే అందుకు నిదర్శనం.
కాసుల కోసం వైద్య సిబ్బంది కక్కుర్తి.. డబ్బులు లేవన్నా కనికరం లేకుండా..!
గుత్తేదారులకు బిల్లులు బకాయి: ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చామని పదేపదే చెప్పే సీఎం జగన్ నిజానికి రోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. వారికి నాణ్యమైన ఆహారం అందించడంలో దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్రంలో వివిధ పనులు చేసిన గుత్తేదార్లకు కోట్ల రూపాయిల బిల్లుల పెండింగ్ పెట్టిన సర్కారు ఐదేళ్లలో అన్ని రంగాలను అల్లాడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చిన రోగులు ఆకలితో అలమటిస్తున్నారు. కొన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఏడాది నుంచి భోజనం పెట్టడం లేదు. జగన్ సర్కారు గుత్తేదారులకు 8నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం వల్లే రోగులకు సమయానికి సరైన ఆహారం లభించడం లేదు. ప్రభుత్వ విధానాలు రోగుల పాలిట శాపంగా మారాయి. వందలామంది రోగులకు భోజనం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోక్కరికి రోజుకు 150 నుంచి 250 రూపాయల వరకు ఆర్థిక భారం పడుతోందని రోగులు చెబుతున్నారు.
ప్రభుత్వాస్పత్రి డైట్ కాంట్రాక్టు బరిలో ముగ్గురు..కలెక్టర్ ఆఫీస్కు చేరిన పంచాయితీ
ఆహారం కోసం అగచాట్లు: ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే రోగికి పౌష్టికాహారం అందించేందుకు రోజుకు 80 రూపాయిలు ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ రోగులకు అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందని రోగులు వాపోతున్నారు. కొవూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏడాదిగా భోజనాలు పెట్టడం నిలిపివేశారు. చికిత్స పొందుతున్న వారు ఆహారం కోసం నానాపాట్లు పడుతున్నారు. జిల్లాలోని వెంకటాచలం, వింజమూరు, ఉదయగిరి, రాపూరు ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి.
"నీళ్లుగా సాంబారు. గెంజిలా మజ్జిగ. ఆహారం బాగుండకపోవటంతో హోటల్, ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నాం. తినాలని ఆహారం పెట్టుకుంటున్నాం. కాని తినలేకపోతున్నాం. తప్పగా తింటున్నాం."- బాధితులు
ఆసుపత్రిలో బెడ్లు లేవని రోగిని బయటకు పంపిన వైద్యులు - రాత్రంతా చలిలో ఉండి మృతి