Political Leaders Wished People on Diwali: వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి దివ్య కాంతులు అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని కలిగించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అన్నారు. దీపావళి దీపాలు మన చీకటి కోరికలు మరియు ఆలోచనలన్నింటినీ నాశనం చేయడానికి, చెడులను నిర్మూలించడానికి, ఒకరికొకరు సహాయం చేసుకునే శక్తిని, ఉత్సాహాన్ని అందించే సమయాన్ని సూచిస్తాయని వివరించారు. శాంతి, సౌభ్రాతృత్వం మరియు సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ఇలాంటి పండుగలు మనకు స్ఫూర్తినిస్తాయన్నారు.
మరింత కాంతివంతంగా 'దీపం2.0': తెలుగు ప్రజలందరికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇది అని తెలిపారు. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా 'దీపం 2.0' పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతివంతం చేస్తున్నామని వెల్లడించారు. తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్యోద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ఆనంద దీపావళి పండుగ రాష్ట్ర ప్రజల జీవితంలో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.
తెలుగు ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇది. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ‘దీపం 2.0’ పథకంతో ఈ దీపావళి…
— N Chandrababu Naidu (@ncbn) October 30, 2024
పండగ వేళ మార్కెట్లో వెలుగులు - దుకాణాలు కిటకిట
జగత్తు మొత్తాన్ని మేలుకొలిపే చైతన్య దీప్తి: దీపావళి సందర్భంగా ప్రజలందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. జగత్తు మొత్తాన్ని మేలుకొలిపే చైతన్య దీప్తి దీపావళి అని అభివర్ణించారు. ఇలాంటి దీపావళి సందర్భంగా తగిన జాగ్రత్తలతో బాణసంచా కాల్చాలని సూచించారు. జాగ్రత్తలు పాటిస్తే దీపావళి నయనానందకరంగా ఉంటుందని ఏ మాత్రం నిర్లక్ష్యంతో టపాకాయలు కాలిస్తే కాళరాత్రిగా వెంటాడే ప్రమాదం ఉందని హెచ్ఛరించారు. ప్రతి ఏటా దీపావళి ముగిసిన తరువాత చాలామంది కాలిన గాయాలతో ఆస్పత్రుల పాలవడం పట్ల ఆవేదన వెలిబుచ్చారు. ఈ దీపావళి పండుగ సకల జనులకు శుభాలను అందచేసి ఆనందకరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
చెడు పాలనపై సంక్షేమ పాలన విజయం: ఆనందకాంతుల దీపావళి పండుగ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్షోభాల చెడు పాలనపై సంక్షేమ పాలన విజయం సాధించిందని చెప్పారు. ఇక ప్రతిరోజూ ప్రతి ఇంటా సంక్షేమం పండుగే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతుందని కూటమి ప్రభుత్వం పేదల లోగిళ్లలో దీపం పథకంతో వెలుగులు నింపనుందని వెల్లడించారు. బాబు సూపర్ సిక్స్ హామీ అయిన ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను పండుగ కానుకగా అందిస్తున్న శుభసందర్భంలో ప్రజలంతా సంతోషంగా, సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
వెలుగుల పండగ వేళ కండీషన్స్ అప్లయ్ - ఆ సమయంలో సిగరెట్ కాల్చకండి!
తెల్ల రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్- నవంబర్4 నుంచి నాలుగు వస్తువులు