20596294Political leaders congratulate Venkaiah Naidu and Chiranjeevi : ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురిని ఎంపిక చేసింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి (Former Vice President Venkaiah Naidu)తోపాటు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బిందేశ్వర్ పాఠక్, వైజయంతిమాల బాలికి, పద్మాసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ ప్రకటించింది. మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు అనౌన్స్ చేసింది. గణతంత్ర దినోత్సవం (Republic Day) వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ అవార్డులపై తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ పవన్ కల్యాణ్ స్పందించారు.
-
Hearty congratulations to former Vice President of India Sri Venkaiah Naidu Garu and Mega Star Sri Chiranjeevi Garu for being awarded the prestigious Padma Vibhushan for their unparalleled contributions in their respective fields. Both of them have paved the path towards success… pic.twitter.com/zlfaoXdDIG
— N Chandrababu Naidu (@ncbn) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hearty congratulations to former Vice President of India Sri Venkaiah Naidu Garu and Mega Star Sri Chiranjeevi Garu for being awarded the prestigious Padma Vibhushan for their unparalleled contributions in their respective fields. Both of them have paved the path towards success… pic.twitter.com/zlfaoXdDIG
— N Chandrababu Naidu (@ncbn) January 26, 2024Hearty congratulations to former Vice President of India Sri Venkaiah Naidu Garu and Mega Star Sri Chiranjeevi Garu for being awarded the prestigious Padma Vibhushan for their unparalleled contributions in their respective fields. Both of them have paved the path towards success… pic.twitter.com/zlfaoXdDIG
— N Chandrababu Naidu (@ncbn) January 26, 2024
క్రమశిక్షణతో విజయపథం వైపు బాటలు : పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు చంద్రబాబు నాయుడు ట్విటర్ (X)వేదిగా అభినందనలు తెలిపారు. తమ తమ రంగాలలో చేసిన అసమాన సేవలకు ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు పొందారని ఆయన కొనిడాయారు. వీరిద్దరూ కఠోర శ్రమ, దృఢ సంకల్పం, తిరుగులేని క్రమశిక్షణతో విజయపథం వైపు బాటలు వేశారని అన్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల నుండి పద్మ పురస్కారాలు దక్కిన ఉమా మహేశ్వరి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్యలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. వారి వారి రంగాలలో విశేష కృషి చేసినందుకు పద్మశ్రీ బిరుదు పొందారని అన్నారు.
అజాత శత్రువుకు అత్యున్నత గౌరవం - ఎల్లప్పుడూ ప్రజలకు దగ్గరగానే వెంకయ్య
ఎందరికో ఆదర్శం : పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు. తన అన్నయ్యకు పద్మవిభూషణ్ వరించడం ఎనలేని సంతోషం కలిగించిందని అన్నారు. చిత్రసీమలో తనదైన స్థానాన్ని స్వయం కృషితో సాధించుకున్నారని, సామాజిక సేవారంగంలో చిరంజీవి సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. వెంకయ్యనాయుడు పద్మవిభూషణ్‌కు ఎంపిక కావడం ముదావహం అని అన్నారు. వెంకయ్యనాయుడు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలోనే ఉన్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు పద్మశ్రీకి ఎంపిక కావడం సంతోషకరం పవన్ పవన్ అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 'పద్మ' పురస్కారం వరించిన కళాకారులు వీళ్లే
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభదినాన స్వాతంత్య్ర పోరాట స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని చంద్రబాబు పేర్కొన్నారు. మహోన్నతమైన చరిత్ర కలిగిన రాజ్యాంగం మనదని లోకేశ్ కొనియాడారు. జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్య్ర సమర యేధులను స్మరించుకున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు మన రాజ్యాంగం ప్రసాదించిందని లోకేశ్ అన్నారు.
-
దేశ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాల నుంచి, ఆకాంక్షల నుంచి ఊపిరి పోసుకున్న రాజ్యాంగం అమలు ద్వారా మనం సాధించిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పురోగతిని దేశ ప్రజలు ఈ వేళ సగర్వంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇటువంటి శుభవేళ... స్వాతంత్ర్య పోరాట…
— N Chandrababu Naidu (@ncbn) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">దేశ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాల నుంచి, ఆకాంక్షల నుంచి ఊపిరి పోసుకున్న రాజ్యాంగం అమలు ద్వారా మనం సాధించిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పురోగతిని దేశ ప్రజలు ఈ వేళ సగర్వంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇటువంటి శుభవేళ... స్వాతంత్ర్య పోరాట…
— N Chandrababu Naidu (@ncbn) January 26, 2024దేశ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాల నుంచి, ఆకాంక్షల నుంచి ఊపిరి పోసుకున్న రాజ్యాంగం అమలు ద్వారా మనం సాధించిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పురోగతిని దేశ ప్రజలు ఈ వేళ సగర్వంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇటువంటి శుభవేళ... స్వాతంత్ర్య పోరాట…
— N Chandrababu Naidu (@ncbn) January 26, 2024
-
మహోన్నతమైన ప్రజాస్వామ్యం, మహోజ్వలమైన చరిత్ర మనది. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు ప్రసాదించింది మన రాజ్యాంగం. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.#RepublicDay2024 pic.twitter.com/Vd0UJeoTt0
— Lokesh Nara (@naralokesh) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">మహోన్నతమైన ప్రజాస్వామ్యం, మహోజ్వలమైన చరిత్ర మనది. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు ప్రసాదించింది మన రాజ్యాంగం. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.#RepublicDay2024 pic.twitter.com/Vd0UJeoTt0
— Lokesh Nara (@naralokesh) January 26, 2024మహోన్నతమైన ప్రజాస్వామ్యం, మహోజ్వలమైన చరిత్ర మనది. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు ప్రసాదించింది మన రాజ్యాంగం. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.#RepublicDay2024 pic.twitter.com/Vd0UJeoTt0
— Lokesh Nara (@naralokesh) January 26, 2024