Police Solved Student Murder Case In 48 Hours In Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యార్థి హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. కేసు పరిష్కారంలో కీలకంగా వ్యవహారించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ రత్న రివార్డులను అందించారు. ఈ సందర్భంగా హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ వి. రత్న మీడియాకు వెల్లడించారు " జిల్లాలోని మడకశిర మండలోని ఓ హైస్కూల్లో ఓ విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి తల్లిపై వ్యామోహం పెంచుకున్న ఓ యువకుడు నిత్యం వేధించేవాడు. అయితే ఆ యువతి అక్రమ సంబంధాన్ని నిరాకరించి పెద్దలకు చెప్పింది. దీంతో పెద్దలు ఆ యువకుడిని మందలించారు. అప్పటి నుంచి యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
బ్లేడుతో గొంతు కోసి హత్య : ఎలాగైనా ఆమెకు ఇష్టమైన సొంత కుమారుడును హతమార్చాలని అతడు నిశ్చయించుకున్నాడు. పథకం ప్రకారమే మరో మహిళ సహకారంతో పాఠశాలకు వెళ్లిన బాలుడిని విరామం సమయంలో బొమ్మలు కొనిస్తానని మాయమాటలు చెప్పి పాఠశాల నుంచి కిడ్నాప్ చేశారు. తరువాత కర్ణాటకలోని పావగాడ అటవీప్రాంతానికి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టివేసి బ్లేడుతో గొంతు కోసి హతమార్చారు. నిందితుడు బాలుడి తల్లికి స్వయానా పెద్దమ్మకొడుకు(cousin brother) అవుతాడు. బాలుడికి నిందితుడు వరుసకు మేనమామ" అని ఎస్పీ వెల్లడించారు.
మహిళలతో అక్రమ సంబంధాలు : హత్య ఘటన వెలుగులోకి రాగానే పోలీసులు పలు బృందాలుగా విడిపోయి 48 గంటల్లో కేసును ఛేదించామని ఎస్పీ తెలిపారు. నిందితుడితో పాటు హత్యకు సహకరించిన మరో మహిళను అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై చాలామంది మహిళలతో అక్రమ సంబంధాలు కలిగి నేరాలకు పాల్పడేవాడని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎల్లప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. సకాలంలో పాఠశాల సిబ్బంది సమాచారం అందించి ఉంటే బాలుడిని రక్షించి ఉండే వాళ్లమన్నారు. తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పిల్లల్ని నిషితంగా గమనించాలన్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే సకాలంలో పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు.
మంత్రి లోకేశ్ సీరియస్ : బాలుడి హత్యోదంతంపై సీఎంఓ అధికారులు సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారులను ఆరా తీశారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి లోకేశ్ విద్యార్థి హత్య ఘటనపై సీరియస్ అయ్యారు. అనంతరం జిల్లా అధికారులు ఈ కేసుపై మరింత దృష్టి పెట్టారు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడును విధుల నుంచి సస్పెండ్ చేశారు. అలాగే పీఈటీ(PET)కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
కొట్టి చంపి బావిలో పడేశారు - సహ విద్యార్థుల ఘాతుకం
Nursing Student Murder in Vikarabad : కన్ను పీకేసి, గొంతు కోసి.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య