Jubilee Hills Hit and Run Case Update: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు మరో షాక్ తగిలింది. రెండు సంవత్సరాల క్రితం జూబ్లీహిల్స్ కేసులో మధ్యంతర బెయిల్‌ను పొందగా దాన్ని రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది పంజాగుట్ట బారికేడ్లను ఢీకొన్న కేసులో రాహిల్ దుబాయ్ నుంచి వచ్చి ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనను విచారిస్తున్న క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహిల్‌ను ఈ కేసులో నిందితుడిగా గుర్తించారు.
EX MLA Shakeel Son Rahil Case : జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ఓ చిన్నారి మృతి చెందగా కారు ప్రమాదానికి కారణమైన ముగ్గురు పారిపోయారు. అందులో రాహిల్ కూడా ఉన్నాడు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం తరువాత తానే వాహనాన్ని నడిపినట్లు ఓ వ్యక్తి లొంగిపోయాడు. అయితే ఈ కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా అదేశించాంటూ రాహిల్ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిలు పొందాడు.
గతేడాది ప్రజాభవన్ వద్ద బారికేడ్లు ఢీ కొన్న ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూబ్లీహిల్స్ కేసు గురించి తెలిసి దీన్ని పునఃప్రారంభించారు. ఈ కేసులో పోలీసులు లొంగిపోయిన వ్యక్తి వాంగ్మూలం తీసుకున్నారు. అందులో ప్రమాదం జరిగినప్పుడు కారు నడిపింది రాహిల్ అని తెలిసింది. రాహిల్ బంధువులు తానే కారు నడిపినట్లు అంగీకరించాలంటూ బలవంతంగా ఒప్పించారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడికి ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు ఉత్తర్వులు వెలువరించనుంది.
షకీల్ కుమారుడు రాహిల్‌కు బిగుస్తున్న ఉచ్చు - పాత కేసు తిరగేస్తున్న పోలీసులు!
Raheel's Jubilee Hills Road Accident : 2022 ఫిబ్రవరి 17వ మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర ఫుట్‌పాత్ వద్ద నివసిస్తూ బెలూన్లు, స్ట్రాబెర్రీలు విక్రయిస్తుండగా ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా చిన్నారి రణవీర్ మృతి చెందాడు. దీంతో కారులో ఉన్న ముగ్గురు యువకులు పారిపోయారు. ఆ వాహనంపై అప్పటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు వివరాలు తెలుసుకుని దర్యాప్తు చేయగా కారు నడిపింది తానేనంటూ ఆఫ్రాన్ అనే యువకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. కారులో తనతో పాటు రాహిల్, స్నేహితుడు మహమ్మద్ మాజ్ ఉన్నారని తెలిపాడు. దీంతో ఆ ఇద్దరి పేర్లనూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
మాజీ ఎమ్మెల్యే కుమారుడి హిట్ అండ్ రన్ కేసు - ఒక్కడిని తప్పించబోయి, 15 మంది నిందితులుగా!