ETV Bharat / state

పోర్న్​ వీడియోలు చూసి బాలికపై అత్యాచారం - ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసి? - NANDYALA MINOR GIRL RAPE CASE

Nandyala Minor Girl Rape Case Updates : ఇంటర్నెట్​లో చూసి బాలికపై అఘాయిత్యానికి తెగించారు. ఆడుకోడానికి వచ్చిన బాలికపై, అత్యాచారం చేశారు. ఎవరికైనా చెప్తుందేమో అనే భయంతో హతమార్చారు. మృతదేహాన్ని ముళ్ల పొదల్లో దాచారు. ఇదంతా చేసింది కరుడుగట్టిన నేరస్థులు కాదు! బడి పిల్లలు! ఇదీ ఏపీలోని నంద్యాల జిల్లాలో సంచలనం రేపిన బాలిక హత్య వెనకున్న మిస్టరీ! ఈ క్రైం కథలో పెడదోవ పట్టిన పిల్లల్ని కాపాడబోయి తల్లిదండ్రులు కూడా నేరంలో కూరుకుపోయారు.

Girl Raped And Killed
Nandyala Girl Rape Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 9:51 AM IST

Nandyala Girl Rape Case Updates : ఆంధ్రప్రదేశ్​ నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక సామూహిక అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల ఏడో తేదీన పగిడ్యాల మండలంలోని ఓ గ్రామంలో 9 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఇద్దరు పదో తరగతి పిల్లలు, ఒక ఆరో తరగతి అబ్బాయి ఆడుకుంటున్న బాలికకు మాయ మాటలు చె‌ప్పారు. చాక్లెట్ ఇచ్చి బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబుతుందనే భయంతో బాలిక గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఏం చేయాలో తోచక మృతదేహాన్ని కేసీ కెనాల్ వద్ద ముళ్ల పొదల్లో దాచారు.

మైనర్లకు తల్లిదండ్రుల సాయం : బాలికను హత్య చేసిన విషయాన్ని ముగ్గురు మైనర్లు ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పారు. నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు ఆ సమయంలో పిల్లల్ని కాపాడాలని నిర్ణయించుకున్నారు. హత్యను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. అదే రోజు రాత్రి శవాన్ని అక్కడి నుంచి వనములపాడు మీదుగా కృష్ణా నదిలో పుట్టిలో తీసుకెళ్లారు.

నిజాన్ని ఎలాగైనా సమాధి చేయాలనుకుని మృతదేహాన్ని తాడుతో రాయికి కట్టి నదిలో పడేసి గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్లారు. నిందితుల్లో ఓ బాలుడి తండ్రి, పెదనాన్న అసలు విషయం చెప్పడంతో పోలీసలు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులైన మైనర్లను జువెనైల్​ హోమ్​కు పంపారు. ఇంటర్నెట్‌ చూసి పిల్లలు పెడదోవ పట్టారని పోలీసులు తెలిపారు.

బాలిక మృతదేహం లభ్యమయ్యే వరకు గాలింపు : బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లతో కృష్ణా నదిలో జల్లెడపడుతన్నా ప్రయోజనం లేకపోతోంది. 6 స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్‌లను రంగంలోకి దించారు. బాలిక మృతదేహం లభ్యమయ్యే వరకు గాలింపు కొనసాగుతుందన్న పోలీసులు పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, విద్యార్థుల్లో చైతన్యం పెంపొందిస్తామని పేర్కొన్నారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు : నిందిత మైనర్లు ఫోన్​లో అశ్లీల వీడియోలు చూసేవారని వాటి ప్రభావంతో బాలికపై దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందని నంద్యాల మాజీ ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. వీరిపై మొదట సెక్షన్ 69/21 కింద బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశామని తాజాగా క్లాజ్ 70/2, క్లాజ్ 103/1, 238 ఏ సహా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.

ఆటోలో ఇంటికి వెళుతున్న యువతి - అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ - Women Raped by Auto Driver

ఇంతకన్నా దారుణం ఉండదేమో! - ఊయలలో ఉండగానే 6 నెలల చిన్నారిపై తాతయ్య అత్యాచారం - Rape on Six Months Baby

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.