ETV Bharat / state

వివేకా హత్య కేసులో కదలిక - ప్రభుత్వ ఆదేశాలతో పోలీసుల విచారణ

వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పోలీసుల విచారణ ముమ్మరం - ఐదో తేదీ పులివెందుల పీఎస్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న డీఎస్పీ

YS Vivekananda Reddy Murder Case
YS Vivekananda Reddy Murder Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 18 hours ago

Updated : 17 hours ago

YS Vivekananda Reddy Murder Case Updates : ప్రభుత్వ ఆదేశాలతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసును విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి ఒకప్పటి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పోలీసు విచారణ ముమ్మరం చేశారు. విచారణకు రావాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బావమరిది ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డితో పాటు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బాబాయ్ వైఎస్​ మనోహర్‌రెడ్డి, తమ్ముడు అభిషేక్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్ ట్రస్ట్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, న్యాయవాది ఓబుల్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. వీరే కాకుండా మరో ఐదుగురు సాక్షులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 5న విచారణకు రావాలని పేర్కొన్నారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు.

గత ఏడాది డిసెంబర్ 15న కృష్ణారెడ్డి ఫిర్యాదుతో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసుపై మళ్లీ విచారణ చేస్తున్న పోలీసులు పది రోజుల కిందట పీఏ కృష్ణారెడ్డి ఈ కేసు అంశంపై డీఎస్పీ మురళీనాయక్​ విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. తాజాగా మరో పది మందిని విచారించేందుకు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్సార్సీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వివేకా పీఏ కృష్ణారెడ్డి, బాధితులు విచారణ అధికారులపైనే ఎదురు కేసు పెట్టారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.

వివేకా హత్య కేసు - చైతన్యరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు - తొలిసారి నోటీసులు

హోం మంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ - వివేకా హత్యపై వివరణ - YS Sunitha Met Home Minister Anitha

తాడేపల్లి ఇంట్లో జగన్ - అసెంబ్లీకి సునీత - ఆ ప్రశ్నకు త్వరలోనే సమాధానం?!

Last Updated : 17 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.