ETV Bharat / state

కూకట్​పల్లిలో హత్యాచారం కేసు- పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారంటే! - Kukatpally Woman Gang Rape Case - KUKATPALLY WOMAN GANG RAPE CASE

Kukatpally Woman Gang Rape Case Update : అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం, ఆపై హత్య. సీసీటీవీ కెమెరాల్లో ఇద్దరు పరారైన అస్పష్ట చిత్రాలు తప్ప పోలీసులకు మరో ఆధారం లభించలేదు. వేలి ముద్రలు, జాగిలాల ద్వారా నిందితుల్ని గుర్తించాలనుకున్నా ఆచూకీ చిక్కలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆ మహిళ హత్య కేసును కూకట్‌పల్లి పోలీసులు ఛేదించారు. దాదాపు 45 కిలోమీటర్ల మేర 14 వందల సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చివరగా మహిళ హత్యాచారం కేసులో పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

kukatpally_woman_gang_rape_case_update
kukatpally_woman_gang_rape_case_update
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 10:04 AM IST

Kukatpally Woman Gang Rape Case Update : రాజమహేంద్రవరానికి చెందిన ఓ మహిళ తన భర్త మరణించడంతో కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి ఒంటరిగా ఉంటోంది. మూసాపేట వై జంక్షన్‌లోని ఓ వాహన షోరూంలో స్వీపర్‌గా పనిచేస్తూ, ఖాళీ సమయాల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన నితీశ్‌కుమార్‌ దేవ్‌తో పాటు ఓ మైనర్‌ సంగారెడ్డిలోని ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. చెడు అలవాట్లకు బానిసైన వీరిద్దరూ పని పూర్తయ్యాక నిత్యం మద్యం సేవించేవారు. ఈ నెల 20వ తేదీన తమ స్నేహితుడిని బిహార్‌కు పంపించేందుకు ద్విచక్ర వాహనంపై నగరంలోని ప్యారడైజ్‌ దగ్గరికి వచ్చి తిరిగి వేళ్లే క్రమంలో ఓ టీ స్టాల్‌ దగ్గర టీ తాగారు.

ప్రేమ పేరుతో యువకుడు - దెయ్యం వదిలిస్తానని స్వామిజీ - మైనర్ బాలిక​పై లైంగిక దాడి

అదే సమయంలో అక్కడ ఓ మహిళ ఒంటరిగా కనిపించింది. సైగలతో ఆమెను వేధించిన నీతీశ్‌ కుమార్​ కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. మైనర్‌ బాలుడిని వెంటపెట్టుకుని ఇద్దరూ ఆమెను కొంత దూరం అనుసరిస్తూ నిర్మానుష్య ప్రాంతంలోని భవనం వద్దకు వెళ్లగానే అడ్డుకున్నారు. అనంతరం సెల్లార్‌లో ఆమెపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. వీరి నుంచి తప్పించుకునే క్రమంలో మైనర్‌ బాలుడు ఆమె కాళ్లను అదిమిపట్టాడు. నితీశ్‌ కుమార్‌ ఆమె తలను బలంగా నేలకు కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కొద్దిసేపటికి మరణించింది.

కూకట్​పల్లిలో హత్యాచారం కేసు- పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారంటే!

"సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్​ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు గుర్తించాం. నాలుగు టీంలుగా విభజించి డీసీపీ ఆదేశాలతో సీసీ కెమెరాలను చెక్​ చేశాం. ఇలా ఆ బైక్​ను వెంబడించి దాని అసలైన ఓనర్​ను పట్టుకున్నాం. అతని ద్వారా బండి ఎవరికి అమ్మారో వారి వివరాలను సేకరించాం. చివరికి సంగారెడ్డిలో వీరిని అదుపులోకి తీసుకున్నాం. విచారించిన తర్వాత నేరం ఒప్పుకున్నారు. వారికి రిమాండ్​ విధించి జైలుకు పంపించాం." - శ్రీనివాసరావు, ఏసీపీ కూకట్‌పల్లి

సవాల్​గా మారిన కేసు : సమాచారం తెలుసుకున్న కూకట్‌పల్లి పోలీసులు కేసును సవాల్​గా తీసుకున్నారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయం కావడంతో సీసీటీవీ కెమెరాల్లో కొన్ని దృశ్యాలు నమోదై అస్పష్టంగానే ఉన్నాయి. దర్యాప్తు సంక్లిష్టంగా మారడంతో పోలీస్‌ సిబ్బంది నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. సుమారు 45 కిలోమీటర్ల పొడవునా మొత్తం 1,400 కెమెరాలను పరిశీలించారు. అందులో నిందితులు వినియోగించిన వాహనాన్ని పోలీసులు గుర్తించారు.

నిందితులు సంగారెడ్డిలోని ఒక బార్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా నిందితులు, నింపాదిగా ఉండడం చూసి వారిని అదుపులోకి తీసుకున్నారు. నితీష్‌కుమార్‌ను రిమాండుకు తరలించి మైనర్‌ బాలుడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. హత్య కేసు ఆధారాలు లేకపోయినా వారంలో నిందితులను పట్టుకోవడంతో కూకట్​పల్లి పోలీసులు చేసిన కృషిని సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి అభినందించారు.

ఏపీలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.