Police Firing at Nampally Railway Station : హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ఆపి పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దుండగులు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. అనంతరం పరారవుతుండగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుల్లో శాయినాజ్‌గంజ్ ఠాణా పరిధిలోని మంగరి బస్తీకి చెందిన 19 ఏళ్ల యువకునిగా గుర్తించారు. బుల్లెట్ ఆ బాలుడి తొడ భాగంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కాగా అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
నాంపల్లి రైల్వేస్టేషన్ ఎదుట గురువారం రాత్రి జరిగిన కాల్పులకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సెంట్రల్‌జోన్ డీసీపీ తెలిపారు. నిందితులను మంగరి బస్తీకి చెందిన రాజు, హబీబ్‌నగర్‌నాలాకు చెందిన ఖాజా అలియాస్ అయాన్‌గా గుర్తించారు. నిందితులు పిక్‌పాకెటింగ్, మొబైల్స్ దొంగతనాలు చేస్తుంటారని గుర్తించారు. ఘటన జరిగే కొద్దిసేపటి క్రితం కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి నుంచి నిందితులు 400 రూపాయలు చోరీ చేసినట్లు గుర్తించారు.
పటిష్ఠ నిఘా ఉంచిన అధికారులు : అయితే డెకాయ్‌టీమ్‌గా విధులు నిర్వహిస్తున్న ఒక సివిల్ కానిస్టేబుల్, ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఆ సమయంలో గొడ్డలితో అక్కడ ఉన్న ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించేందుకు ప్రయత్నించారు. కాగా, నిందితులు రాళ్లు, గొడ్డలితో పోలీసులపై దాడికి ప్రయత్నించారని డీసీపీ ప్రెస్‌నోట్‌లో వెల్లడించారు.
ఆ క్రమంలోనే ఏఆర్ కానిస్టేబుల్ కాల్పులు జరిపారని, బుల్లెట్ రాజు తొడలోకి దూసుకుపోయినట్లుగా తెలిపారు. వెంటనే నిందితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా తర్వాత మరో నిందితుడిని ఖాజా అలియాస్ అయాన్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టు ఎదుట హాజరుపరుస్తామని డీసీపీ వెల్లడించారు.
Hyderabad Hotel Manager Shot Dead : ఉద్యోగం పోయిందనే కోపంలో.. హోటల్ జనరల్ మేనేజర్‌పై కాల్పులు
Gun Firing At Kamareddy : కామారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం... ఒకరికి గాయాలు