Rave Party in Gachibowli : హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న ఓ గెస్ట్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 8 మంది మహిళలు, 18 మంది పురుషులతో కలిపి మొత్తం 26 మందిని అరెస్టు చేసినట్లు గచ్చిబౌలి సీఐ ఆంజనేయులు వెల్లడించారు. నిందితుల నుంచి 40 గ్రాముల గంజాయి, హుక్కా, మద్యం సీసాలు, ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వీరిలో చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నారని పేర్కొన్నారు.
రైల్వే కాంట్రాక్టర్ ఆదిత్య బర్త్ డే ను పురస్కరించుకుని స్థానిక టీఎన్జీవో కాలనీలో వేడుకలు నిర్వహిస్తూ గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. వీరిలో ఆదిత్య, వరుణ్, సాయి ప్రవీణ్‌లు గంజాయి సేవించినట్లు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని ముగ్గురిపై ఎన్‌డీపీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు సీఐ అంజనేయులు పేర్కొన్నారు. దూల్ పేట్‌లో వరుణ్ గంజాయిని కొనుగోలు చేశాడని తెలిపారు. రేవ్ పార్టీలో ఎవరైనా పాల్గొన్న కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నా యువత మాత్రం ఏ మాత్రం బెదరకుండా పార్టీలు చేసుకుంటున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచారు.
మాదాపూర్ రేవ్ పార్టీ : ఇదే తరహాలో గత నెలలో కూడా మాదాపూర్‌లో రేవ్ పార్టీ జరిగింది. ఈ రేవ్ పార్టీలో విదేశీ మద్యం, కొకైన్, ఎండీఎం డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరుగురు యువతులతో సహా 14 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ టవర్స్ వద్ద అపార్ట్మెంట్లో ఈ తతంగం నడుస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు.
గత నెలలో రాష్ట్ర రాజధానిలోని మాదాపూర్‌లో జరిగిన రేవ్ పార్టీలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. పట్టుబడిన వారిలో ఆరుగురు యువతులుండగా వారిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఇంజినీరింగ్, డెంటల్ విద్యార్థిని, గృహిణి, సేల్స్ విభాగంలో పనిచేసే యువతి ఉన్నారు. హైదరాబాద్‌లో రేవ్ పార్టీ సంస్కృతి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఎక్కడి నుంచే డ్రగ్స్, మద్యం తీసుకురావడం పార్టీల పేరుతో జల్సాలు చేయడం పరిపాఠిగా మారిపోయింది. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు శాఖ ప్రత్యేకంగా నిఘా ఉంచింది.
రేవ్ పార్టీ అంటే ఏమిటి? - అందులోకి వెళ్లిన వారు ఏం చేస్తారు? - What is Rave Party in Telugu
మాదాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం - భారీగా డ్రగ్స్ స్వాధీనం! - rave party breaks out in madhapur