ETV Bharat / state

ఈ దొంగల రూటే సపరేటు - దోపిడీకి ముందు గ్రామ దేవతకు పూజలు - DHAR GANG IN HYDERABAD

అరకిలో బంగారమైన దొరికేలా దోపిడీకి ముందు పూజలు - అనుకున్నట్లు జరిగితే మళ్లీ దేవతకు మొక్కులు చెల్లింపులు - నగరంలో కలకలం రేపుతున్న ధార్ గ్యాంగ్ అలజడులు

Dhar gang Arrested in Hyderabad
Hyderabad police Arrested Dhar Gang (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 9:16 AM IST

Hyderabad Police Arrested Dhar Gang : దోపిడీకి ముందు ఎంతో నిష్టగా గ్రామ దేవతకు పూజలు చేస్తారు. తాము అనుకున్న పని విజయవంతంగా పూర్తవ్వాలని, కనీసం అరకిలో బంగారమైన దొరకాలని ప్రార్థిస్తారు. కత్తులు, ఇతర మారణాయుధాలతో రంగంలోకి దిగుతారు. ఎన్నిరోజులైనా ఎన్ని ఇళ్ల తాళాలు పగలగొట్టైనా అనుకున్నది సాధించేవరకూ ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టరు. అంతా అనుకున్నట్లు జరిగితే మళ్లీ సొంతూరు వెళ్లి దేవతకు మొక్కులు సమర్పిస్తారు. ఇదీ దొంగతనాలకు మారుపేరైన మధ్యప్రదేశ్ ధార్ గ్యాంగ్ దొంగతనాల శైలి. వరుస దోపిడీలకు చేసే ధార్ గ్యాంగ్ అలజడులు ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో కలకలం రేపుతున్నాయి.

గతంలో వరుస దోపిడీ దొంగతనాలకు పాల్పడే ధార్‌ గ్యాంగ్​పై హైదరాబాద్‌ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ ముఠాలోని పలువురిని నగర పోలీసులు అరెస్టు చేశారు. కట్టుదిట్టమైన చర్యల నేపథ్యంలో 2022 జూన్ నుంచి నగరంవైపు కన్నెత్తిచూడని ముఠా కొన్ని నెలలుగా మళ్లీ చెలరేగిపోతోంది. నగర శివార్లు లక్ష్యంగా దోపిడీలకు తెగబడుతున్నారు. ముఠా సభ్యులు ఈ ఏడాది సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 10 స్టేషన్ల పరిధిలో ఏకంగా 31 చోరీలకు పాల్పడ్డారు. ఇవన్నీ చేతికి చిక్కిన నిందితులు చేసిన దోపిడీలు మాత్రమే ఇంకా భారీ ఎత్తున చోరీలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ముఠాలోని మరికొందరిని అరెస్టు చేస్తే నగరంలో దొంగతనాల వివరాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన దొంగలే ఈ ధార్‌ ముఠా సభ్యులు. స్థానిక తాండా, కుక్షి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆదివాసీ గ్రామాలకు చెందిన వారే ఈ ముఠాలో ఎక్కువగా ఉంటారు. నీటి లభ్యత తక్కువగా ఉండడం, కరవు, ఇతర ఇబ్బందులతో దశాబ్దాల క్రితం స్థానికులు దోపిడీలను వృత్తిగా ఎంచుకున్నారు. సుమారు 10 వేల మంది వరకూ చోరీలు మాత్రమే చేసి జీవనం గడుపుతారని పోలీసుల అంచనా. దీంతో సొంత రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఎంపిక చేసుకుని చోరీలు చేస్తుంటాయి.

'సైబరాబాద్​ పరిధిలో 10 కేసులు, రాచకొండలో 9, సంగారెడ్డిలో 5, మెదక్​లో 4, నల్గొండ పరిధిలో ఒక కేసులు ఉన్నాయి. వీటిపై విచారణ చేస్తే 2 కేజీల బంగారం, 10 కేజీల వెండి, రూ.8.5 లక్షలు దొంగతనం చేశారని తెలిసింది'-నరసింహ, క్రైమ్స్ డీసీపీ, సైబరాబాద్

నగరంలో మళ్లీ వరుస చోరీలు : ఇందులో భాగంగా సుమారు 200 మంది వరకూ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నలుగురు ఒక బృందంగా ఏర్పడి పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు. ఆ తర్వాత జన సంచారం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడతారని పోలీసులు చెబుతున్నారు. ధార్ ముఠా 2018 నుంచి నగరంపై విరుచుకుపడుతోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొన్ని చోరీల తీరు ఒకేలా ఉండడం 2020లో సైబరాబాద్ ఓ కేసులో నిందితుడిని అరెస్టు చేసినప్పుడు ధార్ ముఠా గుట్టు బయటపడింది.

నిందితుడు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేయగా దాదాపు 135 దొంగతనాలు చేసినట్లు బయటపడింది. పోలీసులు అప్రమత్తమై 11 మందిని అరెస్టు చేశారు. ముఠా ప్రధాన నాయకులు ఆరుగురిపై పీడీ యాక్టు ప్రయోగించారు. వరుస ఆరెస్టులతో పాటు హైదరాబాద్ చేరగానే పసిగట్టి పోలీసులు పట్టుకోవడంతో 2022 జూన్ నుంచి నగరానికి రావడం మానేశారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఎక్కువగా చోరీలు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల నిఘా తగ్గడం వల్లే ధార్ ముఠా నగరంలో మళ్లీ వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పలు కాలనీల సంఘాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

బస్సులో బంగారంతో ప్రయాణిస్తున్నారా? - థార్ గ్యాంగ్ వచ్చేస్తోంది - బీ కేర్​ఫుల్ - THAR GANG ROBBERIES IN BUSES IN HYD

హైదరాబాద్ వాసులారా జాగ్రత్తగా ఉండండి - ధార్‌ గ్యాంగ్‌ మళ్లీ వచ్చేసింది - Dhar Gang Thefts in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.