ETV Bharat / state

నగరంలో రెచ్చిపోతున్న దారి దోపిడీ దొంగలు - ఏకంగా 13 మంది అరెస్టు - Robbers Arrested in Secunderabad - ROBBERS ARRESTED IN SECUNDERABAD

Secunderabad Robbery Case : హైదరాబాద్‌ నగరంలో దాడి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మాణుష్య ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుంటూ ఒంటరిగా వెళ్లేవారిపై దాడికి పాల్పడుతున్నారు. సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులు, కుత్బుల్లాపూర్‌లో ఓ క్యాబ్‌ డ్రైవర్​ను బెదిరించి డబ్బులు లాక్కున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Secunderabad Robbery Case
Secunderabad Robbery Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 7:34 PM IST

Robbers Arrested in Secunderabad : హైదరాబాద్‌ నగరం పరిసర ప్రాంతాల్లో దారి దోపిడీ దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో దారి కాచి దోపిడీలకు పాల్పడుతున్నారు. అందిన కాడికి దోచుకుంటూ కత్తులతో వీరంగం సృష్టిస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారి దోపిడీకి పాల్పడ్డ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ద్విచక్రవాహనం, రెండు కత్తులు, రెండు సెల్‌ఫోన్లు, రూ.1000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అక్బర్‌ హోటల్‌ సమీపంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి తన క్లాస్‌మేట్​తో మాట్లాడుతుండగా, వారాసిగూడకు చెందిన మహమ్మద్‌ రహీమ్‌ బేగ్‌తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు అకారణంగా వారిద్దరిపై దాడికి పాల్పడ్డారు. నిందితులు దాడి చేస్తున్న క్రమంలో భయపడి పారిపోగా, ద్విచక్ర వాహనంపై వారిని వెంబడించి మరోసారి కర్రలతో కొట్టి వారి నుంచి సెల్‌ఫోన్, నగదును లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. నిందితులంతా వారాసిగూడకు చెందిన యువకులుగా గుర్తించారు. అందులో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని జువైనల్‌ హోమ్​నకు తరలించారు.

క్యాబ్‌ డ్రైవర్‌ను బెదిరించి నగదు వసూలు : మరోవైపు కుత్బుల్లాపూర్‌లోని జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నెహ్రూ నగర్‌లో క్యాబ్‌ డ్రైవర్‌ను బెదిరించి దారి దోపిడీకి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. అర్ధరాత్రి అయ్యాక ఒంటరిగా వెళ్లే వాహనాలు లక్ష్యంగా చేసుకొని వారు దోపిడీలు చేస్తున్నారు. గత మూడు రోజుల్లో రెండు దోపిడీలు చేయగా, నేడు వారిని పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో దారి కాచి నగదు, విలువైన వస్తువులను అపహరించుకుపోతున్న దొంగల ముఠాలు విపరీతంగా పెరిగిపోయాయి. నగర శివారు నిర్మాణుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లాలంటే జనాలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అని భయంగా ఉందని, పోలీసులు ఈ సమస్యపై పరిష్కారం చూపాలని శివారు ప్రాంతవాసులు కోరుతున్నారు.

పట్టపగలే రెచ్చిపోయిన దోపిడీ ముఠా - కారులో వెళ్తున్న యువకుడిపై దాడి చేసి బంగారం చోరీ - Rajendra Nagar chain snatching case

సంగారెడ్డిలో దోపిడీ దొంగల బీభత్సం - ఏకకాలంలో 3 వైన్సులు, రెండు కిరాణా స్టోర్లు, 10 వస్త్ర దుకాణాల్లో చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.