Police Arrest Gang Involved in Circulating Fake Currency Notes In Srikakulam District : శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సరిహద్దు ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. సంత లక్ష్మీపురంలో దొంగ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ మూర్తి తెలిపారు. వీరి నుంచి 57 లక్షల 25 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సరిహద్దు ప్రాంతం పట్టుపురం వద్ద నకిలీ కరెన్సీ నోట్లు మార్పు చేస్తుండగా పోలీసులు పట్టుకుని ఆరా తీయడంతో నకలీ కరెన్సీ చాలామణి చేస్తున్నట్లు బయటపడింది. శుక్రవారం మెలియాపుట్టిలో టెక్కలి డీఎస్పీ మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెలియాపుట్టి మండలం సంత లక్ష్మీపురం గ్రామంలో ఒక ముఠా దొంగ నోట్లు ముద్రిస్తుంది. కరజాడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ దాసరి రవి కూడా వీరికి సహకారాలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దొంగ నోట్ల ముఠా అరెస్ట్- రూ.10లక్షలకు రూ.44 లక్షల నకిలీ కరెన్సీ - Fake Currency Gang Arrest
'జిరాక్స్ మిషన్ ఉపయోగించి కలర్ జిరాక్స్‌లు తీసి నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు. ఈ ముఠా ఎక్కడ నుంచి వచ్చింది? ఏంటని పలు వివరాలు విచారణలో తెలుసుకుంటాం. ప్రజలు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలి.' - మూర్తి, డీఎస్పీ
గతంలోనూ ఇదే ప్రాంతంలో నకిలీ నోట్ల తయారీ ముఠా ఒకటి పోలీసులకు చిక్కింది. విశ్వసనీయ సమాచారం మేరకు మెలియాపుట్టి, పలాస మండలాలకు చెందిన పలువురు యువకులు కొంతకాలంగా నకిలీ నోట్ల తయారీ, చలామణి చేస్తున్నారు. ఇటీవల చాలామందికి నోట్లు నకిలీవిగా అనుమానం రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో దర్యాప్తు నిర్వహించిన పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులతో పాటు నోట్ల తయారీకి వినియోగించే యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో గొప్పిలి కేంద్రంగా నోట్ల చలామణి చేసిన విషయం పలాసలో కేసు నమోదు చేశారు.
లిక్విడ్‌లో ముంచితే ఒరిజినల్ - రూ.30 లక్షలకు మూడు కోట్లు - ఇద్దరు అరెస్ట్