Phone Tapping Case Latest Updates : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీపై నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్నకు నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది. ప్రణీత్‌రావును 5 రోజుల పోలీస్ కస్టడీ కోరగా, పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేసులో నిందితుడు ప్రణీత్‌రావు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావును ఓసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు, కీలక వివరాలను రాబట్టారు. నిందితులందరినీ ఒకేసారి ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని భావించిన పోలీసులు, కస్టడీ కోసం పిటిషన్ వేశారు.
Court Allows to Bhujangarao Custody : రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరికి ప్రణీత్‌తో ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రాజకీయ పార్టీలు నిష్పక్షపాత దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలని కోరుతున్నాయి.