ETV Bharat / state

భూతగాదాలో యువకుడి దారుణ హత్యపై పోలీసు శాఖ సీరియస్ - ఎస్సైపై సస్పెషన్ వేటు - Land Dispute Murder In Narayanpet - LAND DISPUTE MURDER IN NARAYANPET

Police Action on Land Dispute Murder in Narayanpet Dist : నారాయణపేట జిల్లా చిన్నపొర్లలో దాయాదులు దాడిచేసి యువకుడిని హత్య చేసిన ఘటనను పోలీస్‌శాఖ తీవ్రంగా పరిగణించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని సస్పెండ్ చేయగా ఏడుగురు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహన్ని తీసుకోబోమని ఆందోళనకు దిగిన మృతుని కుటుంబసభ్యులు నిందితుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. మృతునిపై దాడికిముందు జరిగిన దాయాదుల మధ్య ఘర్షణ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Land Dispute Murder in Narayanpet
Man Beaten To Death In Land Dispute at Narayanpet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 11:10 AM IST

చిన్నపొర్లలో దాయాదులు దాడి ఘటనపై పోలీసు శాఖ సీరియస్‌ (ETV Bharat)

Man Beaten To Death Over Land Dispute at Narayanpet Dist : నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో భూతగదా విషయంలో దాయాదులు యువకునిపై దాడిచేసి దారుణంగా హత్యచేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అతనిపై దాయాదివర్గం దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు పట్టించుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్న విమర్శలు వెల్లువెత్తడంతో పోలీస్‌శాఖ ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది.

Land Dispute Murder at Narayanpet District Updates : ఈ క్రమంలోనే శాంతి భద్రత పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఊట్కూరు ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనలో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి నలుగుర్ని అరెస్ట్ చేశారు. గువ్వలి చినసంజప్ప, గుడ్డి ఆశప్ప, గువ్వలి శ్రీను, గువ్వలి కిష్టప్పలు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా, మరో ముగ్గురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.

దాయదుల నుంచి రక్షణను కావాలన్న బాధితులు : హత్యకు గురైన యువకుడు సంజప్ప మృతదేహానికి శవపరీక్ష అనంతరం చిన్నపొర్లకు చేరుకోగా మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబీకులు నిరాకరించారు. ఊట్కూరు ఎస్సై సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదంటూ ఆందోళనకు దిగారు. ఎస్సైని సస్పెండ్ చేయడంతో పాటు దాయాదుల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.

Land Dispute Murder in Telangana : ఎస్సైని సస్పెండ్ చేశామని, దాయాదుల నుంచి రక్షణ కల్పిస్తామని వారికి డీఎస్పీ వివరించారు. నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని అవసరమైతే పీడీ యాక్ట్, రౌడీషీట్ తెరుస్తామని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారుల హామీతో ఆందోళన విరమించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

నారాయణపేట జిల్లా చిన్నపొర్లకి చెందిన ఎర్రగండ్ల లక్ష్మప్పకు బాలమ్మ, తిప్పమ్మ ఇద్దరు భార్యలు. మొదటిభార్య బాలమ్మకి సంజప్ప కుమారుడు ఉండగా రెండో భార్య తిప్పమ్మకు పెద్దసౌరప్ప, చిన్న సౌరప్ప ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మప్ప ఉన్న 9 ఎకరాలను ముగ్గురు కుమారులకు సమానంగా పంచారు. ఇద్దరు భార్యలకి సమానంగా పంచితే చెరి నాలుగున్నర ఎకరాలు రావాలన్న అంశంపై రెండు కుటుంబాల మధ్య భూ వివాదం చెలరేగింది. ఏళ్లుగా ఆ వివాదం కొనసాగుతోంది. 2022లో మొదటి భార్య కుటుంబసభ్యులు కోర్టుని ఆశ్రయించారు. ఇరుకుటుంబాలు తరచూ దాడులుచేసుకోవడం, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవడం పరిపాటిగా మారింది.

వ్యక్తిని కిడ్నాప్‌ చేసి 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ - సైబర్‌క్రైమ్‌ ఏసీపీ, తలకొండపల్లి ఎమ్మార్వోపై కేసు నమోదు - Kidnapping case against ACP and Mro

ఆ వివాదాల నడుమ పెద్ద సౌరప్ప కుమారుడు, మృతుడు సంజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టు తీర్పు వచ్చే వరకి ఎవరి భూమిలోవారు సాగు చేసుకోవాలని సూచించడంతో పెద్ద సౌరప్ప అతని కుమారుడు సంజప్ప, చిన్న సౌరప్ప ఆయన భార్య కవిత వివాదంలో ఉన్న భూమి వద్దకు దున్నేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న దాయాదులు అక్కడకు చేరుకొని నలుగురిపై దాడికి దిగారు. ఆ ఘటనలో పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్ప అక్కడ నుంచి పారిపోగా సంజప్ప, అతని చిన్నమ్మ కవితపై దాడికిదిగారు.

చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన సంజప్ప : సంజప్పపై కర్రలతో మూకుమ్మడి దాడిచేశారు. అతను అపస్మారక స్థితికి చేరుకోగా బాధితుడిని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకురాలేదు. గ్రామపెద్దల సాయంతో తొలత ట్రాక్టర్‌లో గ్రామానికి, ఆ తర్వాత 108లో నారాయణపేట ప్రభుత్వాసుపత్రి, మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

ఫోన్ చేసినా స్పందించని పోలీసులు : కవిత ఫిర్యాదు మేరకు గుట్టప్ప, ఆశప్ప, సంజీవ్, చిన్న వెంకటప్ప, శ్రీను, కిష్టప్ప, నట్టలప్ప ఏడుగురుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రత్యర్థులు దాడి చేస్తున్న సమయంలో డయల్ 100కు ఫోన్ చేశామని, పోలీసులు రావడం ఆలస్యమైనందువల్లే సంజప్ప మరణించారని కవిత ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆ ఆరోపణల్ని తోసిపుచ్చారు. డయల్ 100కు ఫోన్ రాగానే సిబ్బందిని పంపామని అంటున్నారు. మృతుడు హైదరాబాద్‌లో మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. సంజప్పకు భార్య అనిత, మూడేళ్లలోపు చిన్నారులు సాత్విక్, వంశీ కుమారులు ఉన్నారు.

మంటగలిసిన మానవత్వం - అందరు చూస్తుండగానే తమ్ముడిని కొట్టి చంపిన అన్నలు - LAND DISPUTE KILLED A MAN

పవర్ ప్లాంట్​ కోసం భూసేకరణ.. పరిహారం కోసం రైతుల పోరు.. పోలీస్ వ్యాన్​కు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.