PM Modi Virtually Inaugurates Key Railway Projects : భారతీయ రైల్వే ఆధునీకరణలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా రూ.85 వేల కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతి ద్వారా జాతికి అంకితం చేశారు. 10 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరియు ఇతర రైలు సేవలకు జెండా ఊపి ప్రారంభించారు. అందులో భాగంగా మెదక్ జిల్లా రామయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్లో(Railway Station) రైల్వే అధికారులు హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ శ్రీ తేజ, మరియు అక్కన్నపేట ప్రజాప్రతినిధులు గ్రామస్తులు వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్, వన్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ లో తెలంగాణ పిండి వంటకాలు రైల్వే ప్రయాణికుల కోసం నేటి నుంచి అందుబాటులో ఉంచారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేసి ప్రధాని మోడీ ప్రసంగాన్ని మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలను వీక్షకులు చూసేందుకు ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ టు విశాఖపట్నం రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
PM Modi Virtually Inaugurates Dichpally Goods Shed : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో నూతనంగా నిర్మించిన గూడ్స్ షెడ్‌ను(Goods Shed) ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ వేదికగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే(MLA) ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ డిచిపల్లిలో గూడ్స్ షెడ్ నిర్మించడంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ(PM MODI) గత పదేళ్ల కాలంలో దేశంలో రైల్వే వ్యవస్థను వేగవంతంగా అభివృద్ధి చేశారన్నారు. మోదీ హయాంలో 85%ఎలక్ట్రానిక్ రైల్వే పనులను పూర్తి చేశారని అన్నారు. దేశాభివృద్ధిలో రైల్వే వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని రైల్వే ద్వారా రవాణా పెంచే విధంగా మోదీ ప్రభుత్వం(Government) కృషి చేస్తుందని తెలిపారు. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్ లను ఈ కార్యక్రమంలో డిచిపల్లి ఎంపీపీ గద్దె భూమన్న, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.
'అంతర్జాతీయ ప్రమాణాలతో వందేభారత్‌ను ప్రవేశపెట్టాం'
తెలుగు రాష్ట్రాల పట్ల బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టామని వెల్లడించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్రమోదీ వర్చవల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 6 రోజుల పాటు నడుస్తుంది. ఒక్క గురువారం రోజు మాత్రం మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100 శాతం కన్నా ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తోంది. అలాగే నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో నిర్మించిన గూడ్స్ షెడ్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇవాళ ప్రారంభించిన రైలుతో కలిపి దక్షిణ మధ్య రైల్వేలో 4 వందేభారత్ రైల్లు నడుస్తున్నాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన!
వారసత్వ నేతల అవినీతిని వెలికితీస్తున్నా - అందుకే వారికి భయం పట్టుకుంది : మోదీ
రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - దక్షిణ భారత్‌కు తెలంగాణ గేట్‌వేలా నిలుస్తుంది : మోదీ