ETV Bharat / state

నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన - రూ.9 వేల కోట్లతో చేపట్టే వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన - Modi Telangana Visit

PM Modi Sangareddy Tour Today : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కలిసి రూ.9 వేల కోట్లతో చేపట్టే వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని, పలు అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు. అధికారిక కార్యక్రమం అనంతరం పటాన్‌చెరులో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.

PM Modi Sangareddy Tour Today
PM Modi Second Day Visit to Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 7:18 AM IST

రాష్ట్రంలో రెండో రోజు మోదీ పర్యటన - నాందేడ్‌ అఖోలా నేషనల్​ హైవేని జాతికి అంకితం చేయనున్న ప్రధాని

PM Modi Sangareddy Tour Today : రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని, అనంతరం అక్కడే బీజేపీ విజయ సంకల్ప సభలో (BJP Vijaya Sankalpa Sabha) పాల్గొన్నారు. కార్యక్రమం తర్వాత తమిళనాడుకు వెళ్లారు. చెన్నైలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ, సోమవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్నారు.

రాజ్‌భవన్‌లో రాత్రి బస చేసిన ఆయన, రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ సికింద్రాబాద్‌ మహంకాళి (Secunderabad Mahankali) అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత, బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సంగారెడ్డి జిల్లాకు బయలుదేరతారు.

PM Modi Second Day Visit to Telangana : ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. ముందుగా అధికారిక కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.1,409 కోట్లతో నిర్మించిన ఎన్​హెచ్​-161 నాందేడ్‌ అఖోలా జాతీయ రహదారిని (Nanded Akhola National Highway) ఈ సందర్భంగా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.

తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం : ప్రధాని మోదీ

అదేవిధంగా సంగారెడ్డి క్రాస్‌ రోడ్డు నుంచి మదీనాగూడా వరకు రూ.1298 కోట్లతో ఎన్​హెచ్​-65ని 6 వరుసలుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మెదక్‌ జిల్లాలో రూ.399 కోట్లతో చేపడుతున్న ఎన్​హెచ్​-765డీ, మెదక్‌-ఎల్లారెడ్డి జాతీయ రహదారి విస్తరణ, రూ.500 కోట్లతో ఎల్లారెడ్డి-రుద్రూర్‌ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అధికార కార్యక్రమం అనంతరం పటేల్‌గూడలోని ఎస్​ఆర్​ ఇన్ఫినిటీలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు మోదీ హాజరవుతారు.

Traffic Restrictions of Modi's Telangana Visit : ప్రధాని మోదీ అధికార, పార్టీ కార్యక్రమాల సందర్భంగా అధికార యంత్రాంగం, బీజేపీ నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పార్టీ సభకు పెద్దఎత్తున జన సమీకరణ చేయటంలో కమలదళం నిమగ్నమైంది. ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy), ఇతర ప్రముఖుల పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సంగారెడ్డి పర్యటన అనంతరం బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ప్రధాని, రాష్ట్రంలో రెండ్రోజుల పర్యటన ముగించుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌ బయలుదేరతారు.

"పటాన్​చెరు సిటీకి దగ్గరలో ఉంటుంది. సాధారణంగా కాస్త రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా దృష్ట్యా, ప్రజల సౌకర్యార్ధం కొన్ని ట్రాఫిక్ నిబంధనలు ప్రత్యేకంగా తీసుకువచ్చాం. ప్రయాణికులకు, వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రూట్​లను తెలిపే క్యూఆర్​ స్కానర్స్​ను ఏర్పాటు చేశాం. వాటిని స్కాన్​ చేస్తే సులభతరంగా వెళ్లడానికి, మళ్లించిన కొత్త రూట్లను చూపుతాయి." - రూపేశ్‌, సంగారెడ్డి ఎస్పీ

'కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కు - ప్రభుత్వం మారినా పాలనలో మార్పు లేదు'

'కేంద్రంతో లొల్లి రాష్ట్రాభివృద్ధికి ఆటంకమే - తెలంగాణకు మోదీ పెద్దన్నలా సహకరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.