ETV Bharat / state

దివిసీమ ఉప్పెన విషాదానికి 47 ఏళ్లు - మళ్లీ వెంటాడుతున్న భయాలు - DIVISEEMA CYCLONE SHELTERS ISSUE

దివిసీమ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న తుపాను షెల్టర్లు - 30 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న కరకట్టలు - బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

Diviseema Cyclone Shelters Issue in krishna District
Diviseema Cyclone Shelters Issue in krishna District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2024, 7:13 AM IST

Diviseema Cyclone Shelters Issue in krishna District : దివిసీమ ఉప్పెన.. సరిగ్గా 47 ఏళ్ల క్రితం ఇదే రోజు వచ్చిన జల ప్రళయం వేల మందిని పొట్టనపెట్టుకుంది. కడలి ఉప్పొంగి లంక గ్రామాల్లో కడుపుకోత మిగిల్చింది. ఊళ్లకు ఊళ్లను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టింది. ఈ విషాదం నేర్పిన పాఠంతో దివిసీమలో అల్లకల్లోల పరిస్థితులు ఎదురైనప్పుడు బయటపడేందుకు తుపాన్‌ షెల్టర్లు, కరకట్టలు నిర్మించారు. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రక్షణ వ్యవస్థలు శిథిలావస్థకు చేరుకోవడంతో కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

మళ్లీ వెంటాడుతున్న భయాలు : దివిసీమ ఉప్పెన తాలుకా భయాలు అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల ప్రజలను నేటికి వెంటాడుతున్నాయి. 1977లో దివిసీమ ఉప్పెన తర్వాత 1978లో మూడు మండలాల్లో ప్రభుత్వం 30 వరకు తుపాను షెల్టర్లు నిర్మించింది. సముద్రం పక్కనున్న గ్రామాల్లో ఒక్కసారిగా గాలి, వర్షం, సముద్ర అలల తాకిడి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు తుపాన్ షెల్టర్లు నిర్మించారు. ప్రస్తుతం వాటిలో కొన్ని పూర్తిగా పాడైపోగా కొన్నింటిని అధికారులు కూల్చివేశారు. మూడు మండలాల పరిధిలో కృష్ణా నదికి వచ్చే వరదల నుంచి రక్షణగా నిర్మించిన కరకట్ట గుల్లలమోద నుంచి ఉల్లిపాలెం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర దెబ్బతింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు కరకట్టను నిర్లక్ష్యం చేయడంతో తమ జీవనం ప్రశ్నార్థకంగా మారిందని తీరప్రాంత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దివిసీమ గుండెకోత.. అప్పులు తీరక అన్నదాతల బలవన్మరణాలు

దివిసీమ ఉప్పెన విషాదానికి 47 ఏళ్లు - మళ్లీ వెంటాడుతున్న భయాలు (ETV Bharat)

రాత్రింబవళ్లు కాపలా : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో కరకట్టను బలహీనం చేశారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు పథకంలో భాగంగా కరకట్టకు మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. ఇటీవల కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని దివిసీమ వాసులు భయాందోళనకు గురయ్యారు. కరకట్టలకు గండ్లు పడిన చోట్ల ఇసుక బస్తాలు వేస్తూ రాత్రింబవళ్లు కాపలా కాశారు. 11 లక్షల క్యూసెక్కులకు మించి వరద వస్తే ప్రస్తుత కరకట్టలు తట్టుకోలేవని పెనుప్రమాదం సంభవించవచ్చని స్థానికులు భయపడుతున్నారు. కరకట్టల ఎత్తుపెంచడంతో పాటు పటిష్టం చేయాలని కోరుతున్నారు.

కడలి కల్లోలానికి 42 ఏళ్లు.. బాధితుల్లో ఇంకా కన్నీళ్లు

మొలకెత్తిన వరి పనలు - చేలల్లోనే పంటను దున్నేస్తున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.