ETV Bharat / state

క్షణం క్షణం ఆందోళన - లంక గ్రామాల్ని ముంచెత్తిన కృష్ణమ్మ - Krishna Floods in Lanka Villages - KRISHNA FLOODS IN LANKA VILLAGES

People Suffer Due to Flood Effect in Joint Guntur District : చుట్టూ వరదనీరు. వాగులను తలపిస్తున్న రహదారులు. ఇళ్లలో నడుములోతు నీటిప్రవాహం. ఎక్కడికక్కడ తడిచిపోయిన తిండిగింజలు. చెల్లాచెదురైన సామగ్రి. కొట్టుకుపోయిన వస్తువులు. కరెంటు సరఫరా లేక చీకట్లోనే జీవనం. అన్నీ వరద పాలవడంతో అధికారులు ఇచ్చే ఆహారపొట్లాల కోసం ఆశగా ఎదురుచూడాల్సిన దుస్థితి ఉమ్మడి గుంటూరు జిల్లాలో నెలకొంది.

KRISHNA FLOODS IN LANKA VILLAGES
KRISHNA FLOODS IN LANKA VILLAGES (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 10:21 AM IST

People Suffer Due to Flood Effect in Joint Guntur District : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 25 లంక గ్రామాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా వరదముంపునకు గురయ్యాయి. లంకల్లో ఎత్తయిన ఇళ్లలోకి సైతం వరద చేరడంతో ఊహించని నష్టం జరిగింది. 70 శాతం పైగా ఇళ్లలోకి వరదనీరు చేరడంతో పైకప్పులే వారికి ఆవాసాలయ్యాయి. ప్రాణాలు దక్కితే చాలు దేవుడా అని పైకప్పులు ఎక్కి వరద తగ్గేవరకు వేచిచూశారు. మంగళవారం (Sep 3) ఉదయానికి వరద తగ్గుముఖం పట్టడంతో కిందికి దిగి ఇంటి పరిస్థితిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. సామగ్రి అంతా పాడైపోవడం చూసి ఆవేదన చెందారు. అక్కడ ఉండే పరిస్థితి లేకపోవడంతో గ్రామంలో వరదనీరు చేరని ఇళ్లకు వెళ్లి అక్కడే తలదాచుకుంటున్నారు. ఆదివారం రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చీకట్లో దోమలతో అవస్థలు పడుతున్నారు.

కృష్ణమ్మ వరద ఉద్ధృతి : విద్యుత్తు సరఫరా లేక తాగునీటి పథకాలు పనిచేయడం లేదు. ప్రభుత్వం సరఫరా చేసే నీటి ప్యాకెట్లు, ఆహార పొట్లాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకశ్రద్ధ తీసుకుని బాధితులకు ఎప్పటికప్పుడు ఆహారం అందించారు.వరద పెరగడంతో కొందరు ఎటూ వెళ్లలేని పరిస్థితిలో లంకల్లో చిక్కుకుపోయారు. బీరువాల్లోకి నీరు చేరడంతో విలువైన పత్రాలు, దుస్తులు బురదమయమయ్యాయి. ట్రాక్టర్లు తిరగబడ్డాయి. గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు కొట్టుకుపోయి ఆర్థికంగా తీవ్రనష్టం వాటిల్లింది. కట్టుబట్టలు మినహా సర్వస్వం కోల్పోయామని లంక గ్రామాల్లోని ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.

వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన - ఆహారం అందుతుందా? లేదా? అని ఆరా - Ministers Visit Flooded Areas

ఒక్క ఎకరా పంట కూడా మిగిలే పరిస్థితి లేదు : గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కరకట్ట లోపల ఉన్న పొలాలన్నీ వరద ఉద్ధృతికి పూర్తిగా కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో కోట్ల విలువైన పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. కరకట్టపై నుంచి చూస్తే అరటి చివరి కొనలు మినహా పంటలేవీ కనిపించడం లేదు. తమలపాకు తోటల్లో కేవలం ఊతకర్రలు మాత్రమే మిగిలాయి. విద్యుత్తు స్తంభాలు మునిగిపోయే అంత ఎత్తున వరద ప్రవాహం ఉండటంతో ఒక్క ఎకరా పంట కూడా మిగిలే పరిస్థితి లేదని అధికారులు భావిస్తున్నారు. లంక భూముల్లో సాగయ్యేది వాణిజ్య, ఉద్యాన పంటలు కావటంతో పెట్టుబడులు భారీగా పెట్టిన రైతులు వందల కోట్లు నష్టపోయారు. వరదనీటిలోని పొలాలను చూసి ఆవేదన చెందుతున్నారు.

బుడమేరు ఎఫెక్ట్ అప్డేట్స్ - ఆపద్బాంధవుల్లా నిలిచిన సహాయక బృందాలు - Budameru Floods

కరకట్టలపై రాత్రంతా కాపలా : కృష్ణానదికి 11.45 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో కరకట్ట ఎక్కడ తెగుతుందనే ఆందోళన తీర ప్రాంత ప్రజల్లో నెలకొంది. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడు గండిపడుతుందన్న ఆందోళన వెంటాడింది. పెదపులివర్రు, రావిఅనంతవరం, పల్లెపాలెం, ఓలేరు తదితర ప్రాంతాల్లో ఈ రాత్రి గడిస్తే చాలు అని జాగారం చేశారు. నీరు లీకేజీలు వస్తుండటంతో మట్టి, ఇసుక బస్తాలు వేస్తూ కట్టపై కాపలా కాశారు. అధికార యంత్రాంగం అక్కడే ఉండి వారికి అవసరమైన సామగ్రి సరఫరా చేసింది. ఇళ్లలో ఉన్నవారు సైతం ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో గడిపారు. సామాన్లు సర్దుకుని ఖాళీ చేయటానికి సిద్ధమయ్యారు. ఉదయానికి వరదనీరు తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రానికి వరద తగ్గడంతో కరకట్టకు ముప్పు లేదన్న భరోసా పొందారు. ప్రభుత్వ యంత్రాంగం ఎంతో బాగా సహకరించిందని హర్షం వ్యక్తం చేశారు.

విజయవాడలో భారీగా ఆహారం పొట్లాలు సిద్ధం - పంపిణీని పరిశీలించిన మంత్రి నారాయణ - Narayana on Food Distribution

సహాయ చర్యలను పర్యవేక్షించిన మంత్రులు : గుంటూరు జిల్లాలో 600 లంక కుటుంబాలు ముంపు బారిన పడ్డాయి. బాపట్ల జిల్లాలోఇల్లు నీటమునిగి 12,943 మంది బాధితులుగా ఉన్నారు. నిర్వాసితులు ఎక్కడికక్కడ కరకట్ట వెంట రోడ్లపై గేదెలు, గొర్రెలను తరలించి వరద ఎప్పుడు పూర్తిగా తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు. కృష్ణమ్మ శాంతించాలని పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, చీరతో పూజించి కాపాడమని వేడుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు సహాయ చర్యలను పర్యవేక్షించారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాల్లో మండలి బుద్దప్రసాద్ తనయుడు మండలి వెంకట్ రామ్, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పర్యటించి వరద బాధితుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కరకట్టపై ఉన్నవాళ్ళు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణానది వరద కరకట్టలను గాలికి వదిలేసిందని విమర్శించారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణమ్మ ఉగ్రరూపం - ఊళ్లకు ఊళ్లే నీటమునక - Flood Effect in Joint Guntur

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.