ETV Bharat / state

రాష్ట్రాన్ని వణికిస్తున్న చలిగాలులు - అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత @5.7 డిగ్రీలు - WEATHER UPDATE

రాష్ట్రంలో క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు - అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 5.7 డిగ్రీలు

Cold Increased in AP
Cold Increased in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Cold Effect on AP : రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాత్రివేళల్లో అయితే చలికి రోడ్లపై జనసంచారం తగ్గింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలను గడగడలాడిస్తోంది. కొన్ని జిల్లాల్లో రెండు రోజులుగా చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. శనివారం రాత్రి దాదాపుగా ఆంధ్రప్రదేశ్​లోని అన్ని జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.

Cold Increased in AP
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో కురుస్తున్న పొగమంచు (ETV Bharat)

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కుంతలాంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 5.7 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అదే జిల్లాలోని జిల్లాలోని జి.మాడుగులలో 6.2, డుంబ్రిగుడలో 7.9 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆ జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల లోపే పడిపోయాయి. శ్రీకాకుళం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, విజయనగరం, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, కాకినాడ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తగ్గాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Cold Wave Hits in AP : మరోవైపు వాతావరణం ఒక్కసారిగా మారడంతో సీజనల్‌ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా ముఖానికి మంకీ క్యాప్‌, మఫ్లర్‌ వంటివి ధరించాలని చెబుతున్నారు. చలికాలంలో వృద్ధులు, శ్వాసకోస వ్యాధులతో ఇబ్బందులు పడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. రక్తపోటు, హృద్రోగ బాధితులు తమ ఆరోగ్యంలో ఏమాత్రం తేడా కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు వివరిస్తున్నారు.

60 సంవత్సరాలు నిండిన వారు న్యుమోనియా రాకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఏటా చలి కాలానికి ముందే ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లలకు క్రమం తప్పకుండా ప్రభుత్వం సూచించిన నిర్దేశిత షెడ్యూలు ప్రకారం అన్ని వ్యాక్సిన్లు ఇప్పించాలని పేర్కొంటున్నారు. శీతల పదార్థాలు, పానీయాల జోలికి అస్సలు వెళ్లకూడదని అంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు తగిన పోషకాహారం తీసుకోవాలని వివరిస్తున్నారు. సమతులాహారం తీసుకోవాలని తాజాగా వండిన వేడి ఆహారాన్ని తినాలని వైద్యులు తెలియజేస్తున్నారు.

చలి కాలంలో డ్రైవింగ్​ - ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

పడిపోతున్న ఉష్ణోగ్రతలు - ఏజెన్సీలో అందాలను ఆస్వాదిస్తున్న పర్యటకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.