ETV Bharat / state

అదిరిపోయిన 'ఫుడ్‌ బిజినెస్‌' - ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఆసక్తి - Food Business Expo in vijayawada

Food Business Expo in Vijayawada : ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభిరుచికి అద్దం పట్టిన 'ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

people_impressed_for_food_business_expo_in_vijayawada
people_impressed_for_food_business_expo_in_vijayawada (ETV Bharat)

People Impressed for Food Business Expo in Vijayawada : ఆహార ప్రియులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభిరుచికి విజయవాడలో నిర్వహించిన 'ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో' అద్దం పట్టింది. వివిధ రకాల ఆహార పదార్థాలతో పాటు వంటగది, వ్యాపారపరంగా వినియోగించే వస్తు సామగ్రిని ప్రదర్శనలో ఉంచారు. ఆహార వస్తువులే కాకుండా ఫర్నిఛర్, లైఫ్ స్టైల్ కు సంబంధించి పలురకాల వస్తువులు ప్రదర్శనలో కొలువు దీరాయి.

ఆకట్టుకుంటున్న ఫుడ్‌ బిజినెస్‌ ఎక్స్‌పో : విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ హాలులో మూడు రోజులుగా జరిగిన ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో అందరినీ ఆకట్టుకుంది. వివిధ రకాల ఆహార పదార్థాలు స్టాళ్లలో కొలువు దీరాయి. గృహిణులు ఇళ్లల్లో వినియోగించే హోంనీడ్స్, ఇతర అలంకరణ సామగ్రిని ప్రదర్శనలో ఉంచారు. జీడిపప్పుతో తయారుచేసే వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శనలో ఉంచారు. ఆఫ్రికా నుంచి దిగుమతి చేసిన జీడిపప్పును స్పైసీగా వివిధ రకాల రుచుల్లో వీటిని అందిస్తున్నారు. చిన్న చిన్న హోటళ్లు నిర్వహించాలనుకునేవారి కోసం వంటపాత్రలు, తయారీ పాత్రలు, చాట్ కౌంటర్, కర్రీ కౌంటర్ లను ప్రదర్శించారు.

విజయవాడ బైపాస్​కు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ - అత్యంత వేగంగా పట్టాలెక్కే అవకాశం - Vijayawada East Bypass Road

రకరకాల ఆహార పదార్ధాలు, ఫర్నీచర్‌, హోంనీడ్స్‌ : కాఫీ సొల్యూషన్ పేరుతో వివిధ రకాల కాఫీలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేలా పలురకాల మోడళ్లను అందుబాటులో ఉంచారు. ఒక్కో యూనిట్ 50వేల రూపాయల నుంచి 17 లక్షల రూపాయల వరకు ధర పలుకుతుంది. నచ్చిన ఆకారంలో ఐస్ క్రీములు తయారుచేసే మిషన్లు, చెరకురసం పిండే యంత్రాలు, సోడా, స్వీట్ కార్న్ మిషన్లు, 3 నిమిషాల్లో ఈజీగా కప్ పిజ్జా తయారయ్యే యంత్రాలు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. నూనెతో కాకుండా కేవలం వేడిమి ద్వారా స్నాక్స్ ను తయారుచేసే మిషన్లు ప్రదర్శనలో ఆహార ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. అటు ఆరోగ్యంతోపాటు ఇటు సులువుగా స్నాక్స్ ను తయారుచేసుకోవడానికి ఇవి ఉపయోగడపడతాయని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరిగింది. నాన్ వెజ్ కాకుండా వెజ్ పదార్థాలపై దృష్టి సారిస్తున్నారు. ఇలాంటివారికోసం నాన్ వెజ్ కు బదులుగా వచ్చిన వెజ్ చికెన్, వెజ్ మటన్లను ప్రదర్శలో ఉంచారు. మష్రూమ్ బాల్స్, సోయా బాల్స్ తో తయారుచేసిన ఈ వంటకాలు ఆహార ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

" 'ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో'లో అన్నింటినీ ఓకే చోట ప్రదర్శించటం చాలా బాగుంది. వివిధ రకాల ఆహార పదార్థాలు, ఫర్నిచర్‌, హోంనీడ్స్, లైఫ్‌స్టైల్‌కు సంబంధించి పలురకాల వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ ప్రదర్శన ప్రస్తుతం, రాబోయో తరాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది. నాన్ వెజ్ కు బదులుగా వచ్చిన వెజ్ చికెన్, వెజ్ మటన్‌, సుగంధ ద్రవ్యాలు, పలు రకాల బాస్మతీ రైస్‌ ప్రత్యేకంగా ఉన్నాయి." - సందర్శకులు

కదలకుండానే రన్నింగ్, జాగింగ్ : వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పలురకాల బాస్మతీ రకాల బియ్యాన్ని ప్రదర్శనలో విక్రయించారు. వీటితోపాటు ఇంటికి శోభను తెచ్చే పలురకాల ఫర్నిఛర్ సామగ్రిని ప్రదర్శించారు. వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు సోపాలు, మంచాలు, కుర్చీలు అందుబాటులో ఉండి ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, బరువును తగ్గించుకునేందుకు ఛాలెంజ్ ఫిట్ నెస్ పేరుతో ప్రత్యేక మిషన్లను అందుబాటులో ఉంచారు. మనం కదలకుండానే రన్నింగ్, జాగింగ్ చేసేటట్లు మిషన్ల ద్వారా కదలికలను తెప్పించి బరువును తగ్గించే ఈ మిషన్లు ఆసక్తి రేకెత్తించాయి. నిత్య జీవితంలో అవసరాలను తీర్చడం తోపాటు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్న ఈ మిషన్లు ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయి. మూడు రోజులపాటు జరిగిన బిజినెస్ ఫుడ్ ఎక్స్ ఫో ఆదివారం రాత్రితో ముగిసింది.

ఈ డ్రోన్​ షాట్ ఎప్పుడూ చూసిఉండరు! - నిజంగా 'ఇంద్రకీలాద్రే' - vijayawada Drone view

"బుడమేరూ నువ్వెందుకు బుస కొట్టావ్?" - "నా భూములు కబ్జా చేస్తే ఊరుకుంటానా!" - Budameru Vagu Encroachments

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.