Leopards Migration in Nandyala District : ఏపీలోని నంద్యాల జిల్లా మహానంది, శిరివెళ్ల మండలాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత పులుల సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోన్నాయి. ఇప్పటికే శిరివెళ్ల మండలం పచ్చర్ల వద్ద చిరుత పులి దాడిలో ఓ మహిళ మృతి చెందారు. మరో ఘటనలో ఇంకో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆ పులిని ఇప్పటికే అధికారులు బోనులో బంధించారు.
చిరుతను తప్పించబోయి కారు బోల్తా - మహిళ మృతి - Road Accident In Nizamabad
తాజాగా మరో చిరుత పులి కదలికలు మహానంది గోశాల సమీపంలో సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అటవీశాఖ అధికారులు వెంటనే చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్‌తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు.
నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్స్ కెమెరాలో చాలా ఏళ్ల తర్వాత పెద్దపులి కనపడిందని, కంబాలపల్లి రేంజ్ పరిధిలోని కృష్ణపట్టి ఏరియాలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాంతం నుంచి నల్లమల అటవీ ప్రాంతం వరకు పెద్దపులి సంచరించినట్లు ఆనవాళ్లు గుర్తించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం, డిండి నది అడుగంటడంతో పెద్దపులి అనువుగా ఉన్న ప్రదేశం కోసం సంచరిస్తూ దేవరకొండ నియోజకవర్గంలోని నల్లమలకు చేరింది.
నిత్యం 40 కిలోమీటర్లు ఈ పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. దీంతోపాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో రాబందు కూడా ప్రత్యక్షమైందని, నల్లమల అడవిలోని కంబాలపల్లి రేంజ్ పరిధిలో శాఖాహార జంతువులు, నీళ్లు, తదితర సదుపాయాలు పెరగడంతో ఈ రెండు జంతువులు ఇక్కడికి చేరినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో పది అడుగుల గుంతలో చిరుత చిక్కుకుంది. ఆ చిరుతను అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి రక్షించారు. దాదాపు 28 గంటలపాటు గుంతలో ఉన్న చిరుతకు ఆహారం, నీరు అందించి సురక్షితంగా బయటకు తీసి దానిని బంధించారు.
శంషాబాద్లో చిరుతపులి కలకలం! - రంగంలోకి అటవీ శాఖ సిబ్బంది - Leopard AT SHAMSHABAD