ETV Bharat / state

నిశ్శబ్దం ఆవహిస్తోంది - ఖాళీ అవుతున్న కరవు సీమ - MIGRATIONS IN RAYALASEEMA REGION

జనం లేక వెలవెలబోతున్న పల్లెలు, వీధులు - కర్నూలు జిల్లాలో ఈ ఏడాదీ గ్రామాలు ఖాళీ

People Are Migrating Again In Rayalaseema Region
People Are Migrating Again In Rayalaseema Region (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2024, 7:40 AM IST

Updated : Nov 1, 2024, 5:48 PM IST

People Are Migrating Again In Rayalaseema Region : కరవు సీమ మళ్లీ వలస బాట పట్టింది. ఈ ఏడాదీ గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయి. పల్లెలన్నీ జనం లేక వెలవెలబోతున్నాయి. పాఠశాలలు విద్యార్థులు లేక బోసిపోతున్నాయి. వర్షాలు కురిసినా సరైన సమయంలో పడకపోవడం, ఆశించిన మేర పంటలు పండకపోవడం వలసలకు కారణమైంది.

ఏంచేయాలో దిక్కుతోచని స్థితి : కర్నూలు జిల్లాలో గత ఐదేళ్లు వరుసగా కరవు తాండవించింది. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కౌతాళం, కోసిగి, ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి, పెద్దకడబూరు, కోడుమూరు మండలాల్లో వలసలు పెరిగాయి. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవటంతో దిగుబడులు పడిపోయి అధిక శాతం రైతులకు పెట్టుబడులు సైతం రాలేదు. గ్రామాల్లో పనులు లేక ఏంచేయాలో దిక్కుతోచని అన్నదాతలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ముసలి ముతకను ఇళ్లు వద్ద వదలి గ్రామాల నుంచి పొట్టచేతపట్టుకొని పోయారు.

కేంద్ర బడ్జెట్​లో చేయూత - మారిపోనున్న రాయలసీమ ముఖచిత్రం - Union Budget Funds to AP

జనం లేక వెలవెలబోతున్న పల్లెలు : ఇంకా వ్యవసాయ కూలీలు వలసలు వెళ్తున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, కోడుమూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో వలసలు ఊపందుకున్నాయి. గ్రామాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏ వీధిలో చూసినా ఇళ్లకు తాళాలే కనిపిస్తున్నాయి. దుకాణాలు మూతపడ్డాయి. అక్కడక్కడా వృద్ధులు, చిన్న పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. కాస్తో కూస్తో పనిచేయగలిగిన వారంతా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలకు వలస వెళ్లిపోయారు. కొందరు పంట పొలాల్లో పనిచేయటానికి వెళ్లగా, మరికొంతమంది భవన నిర్మాణ రంగంలో కూలీలుగా వెళ్లిపోయారు. తమకున్న ఎద్దులు, ఆవులను సైతం అమ్ముకుని తరలివెళ్లినట్లు ప్రజలు చెబుతున్నారు.

విద్యార్థులు లేక బోసిపోతున్న పాఠశాలలు : వలసల ప్రభావం చిన్నారుల చదువులపై తీవ్రంగా పడుతోంది. తమతోపాటు పిల్లలను తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవటం పిల్లలకు సైతం కూలీ వస్తుండటంతో తల్లిదండ్రులు పిల్లలను తమతో తీసుకెళ్తున్నారు. దీంతో పాఠశాలల్లో హాజరు శాతం భారీగా తగ్గిపోతోంది. 80 శాతం మంది పిల్లలు వలసకు వెళ్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వలస ప్రభావిత గ్రామాల్లోని పాఠశాలలన్నీ వెలవెలబోతున్నాయి.

రాయలసీమ స్టైల్​ వెల్లులి కారం పచ్చడి - సువాసనకే మౌత్ వాటరింగ్ అయిపోతుంది! - Garlic Chutney Recipe

రాయలసీమ స్పెషల్ "ఎగ్​ ఉగ్గాని" తిన్నారా? - ఒక్కసారి ఇలా ట్రై చేయండి - టేస్ట్ అదుర్స్!

Last Updated : Nov 1, 2024, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.