Electricity Charges Increased : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇచ్చిన వార్షికాదాయ నివేదికపై ఏపీఈఆర్సీ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్ ఛార్జీలపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలతో పాటు నేరుగా పౌరులు కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరై తమ అభ్యంతరాలను విద్యుత్ నియంత్రణా మండలికి తెలియచేస్తున్నారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌లు ఇచ్చిన వార్షికాదాయ నివేదికపై ఈఆర్సీ రెండో రోజూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. దీంతో పాటు మల్టీ ఇయర్ టారిఫ్ అంశంపై కూడా ప్రజాభిప్రాయసేకరణను నిర్వహించేశారు.
Power Charges in AP : ఏపీలోని విద్యుత్ పంపిణీ సంస్ధలు ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్లు సమర్పించిన వార్షికాదాయ నివేదికపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌లు 13,887 కోట్ల రూపాయల మేర ఆదాయ లోటును ఏపీఈఆర్సీ ముందు ఉంచాయి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ వార్షికాదాయ అవసర నివేదికతో పాటు మల్టీ ఇయర్ టారిఫ్‌పై కూడా నియంత్రణా మండలి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేసింది. మూడు డిస్కమ్‌ల పరిధిలో ప్రత్యక్షంగా నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణను ఒక్క చోటు నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేపట్టారు.
ఐదేళ్లలో ఐదు సార్లు విద్యుత్ చార్జీల పెంపు - పేదలపై ₹4వేల కోట్ల భారం
ట్రూఅప్ ఛార్జీలు ఎత్తివేయాలని డిమాండ్ : ఎన్నికల సంవత్సరం కావటంతో మూడు డిస్కమ్‌లు అధికార పార్టీ ఒత్తిడి మేరకు టారిఫ్ పెంచబోమని స్పష్టం చేసినా ప్రస్తుతం ఉన్న 13,887 కోట్ల రూపాయల లోటును ఏ విధంగా భర్తీ చేస్తారన్న అంశాన్ని మాత్రం వెల్లడించకపోవటం విమర్శలకు తావిస్తోంది. పరోక్షంగా విద్యుత్ వినియోగదారులపైనే ఆన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని మోపేయొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మూడు డిస్కమ్‌ల పరిధిలోనూ ట్రూ అప్ ఛార్జీలతో పాటు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట యూనిట్‌కు 40 పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టం చేస్తున్న డిస్కమ్‌లు వచ్చే ఏడాదిలో దొడ్డిదారిన ఈ భారాన్ని వినియోగదారులపై వేసేస్తాయని పౌరులు ఆక్షేపిస్తున్నారు. వాస్తవానికి ట్రూఅప్ ఛార్జీల భారం తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
జగనన్న వీర బాదుడు మామూలుగా లేదుగా - సామాన్యుడి గుండె గుభేల్!
2024-25 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర అవసరాలకు 83,117 మిలియన్ యూనిట్లు అవసరం అవుతుందని విద్యుత్ పంపిణీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం జెన్కో ఉత్పత్తితో పాటు, పీపీఏలు తదితర మార్గాల ద్వారా 88,507 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ అందుబాటులో ఉన్నందున దాదాపు 5 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులు ఉంటుందని భావిస్తున్నారు. అయితే పీక్ డిమాండ్ ఉన్న సమయాల్లో అత్యవసర కొనుగోళ్ల కోసం ఎక్కువ మొత్తం చెల్లింపులు చేసి కొనుగోలు చేస్తున్న విద్యుత్ భారాన్ని మళ్లీ వినియోగదారులపై వడ్డించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు - ప్రజలపై 1,723 కోట్ల భారం