ETV Bharat / state

రాష్ట్రంలో పింఛన్ల పండగ- లబ్ధిదారుకు స్వయంగా పింఛన్‌ అందజేసిన సీఎం చంద్రబాబు - CBN STARTED PENSIONS DISTRIBUTION

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 6:52 AM IST

Updated : Jul 1, 2024, 12:15 PM IST

Pensions_Distribution_in_AP_Live_Updates
Pensions_Distribution_in_AP_Live_Updates (ETV Bharat)

Pensions Distribution in AP Live Updates: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛను అందించారు. ఇంటింటికి వెళ్తూ చంద్రబాబు లబ్ధిదారులకు ఫించన్‌ పంపిణీ చేస్తున్నారు. అలాగే వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. పెండింగ్ బకాయిలు కలిపి 7వేల రూపాయల చొప్పున ఫించన్లు అందజేయడంపై.. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

LIVE FEED

12:14 PM, 1 Jul 2024 (IST)

గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారు: పవన్‌

  • పింఛన్ల పంపిణీ ఇవాళ పూర్తవుతుంది: పవన్‌ కల్యాణ్‌
  • ఒకవేళ ఇవాళ కాకపోతే రేపటి వరకు పూర్తవుతుంది: పవన్‌
  • గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారు: పవన్‌
  • వ్యవస్థలను చంపి వ్యక్తులు పెరుగుతున్నారు: పవన్‌కల్యాణ్‌
  • వ్యవస్థలను బలోపేతం చేస్తాం: పవన్‌ కల్యాణ్‌
  • కడప వంటి చోట్ల గనులు మొత్తం ఖాళీ చేశారు: పవన్‌కల్యాణ్‌
  • గతంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు: పవన్‌కల్యాణ్‌
  • కనిపించిన ప్రతిచోటా డబ్బులు దండుకున్నారు: పవన్‌కల్యాణ్‌
  • తప్పులు ఎవరు చేసినా సరిదిద్దుతాం: పవన్‌కల్యాణ్‌
  • ఒక తరం కోసం కాదు.. రెండు తరాల కోసం పనిచేస్తా: పవన్‌

12:13 PM, 1 Jul 2024 (IST)

అన్నీ పనులూ చిటికెలో కావు.. కానీ అయ్యేలా పనిచేస్తాం: పవన్‌

  • నా దేశం, నేల కోసం పనిచేస్తా.. జీతాలు వద్దని చెప్పా: పవన్‌కల్యాణ్‌
  • అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు.. ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుంది: పవన్‌
  • నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభ వెలికితీయాలి: పవన్‌
  • రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే నేను ఉన్నా: పవన్‌
  • విజయయాత్రలు మాత్రమే చేయడానికి నేను సిద్ధంగా లేను: పవన్‌
  • గెలిచినందుకు ఆనందం లేదు.. పనిచేసి మన్ననలు పొందితేనే ఆనందం: పవన్‌
  • దేశంలో మోడల్‌ నియోజకవర్గంగా పిఠాపురాన్ని చేయాలనేది నా ఆకాంక్ష: పవన్‌
  • కాలుష్యం లేని పరిశ్రమలు పిఠాపురం రావాలి: పవన్‌కల్యాణ్‌
  • విదేశాలకు వెళ్లేవారికి ఇక్కడ శిక్షణ ఇప్పించి పంపాలి: పవన్‌
  • డబ్బులు వెనకేసుకోవాలనో? కొత్త పేరు రావాలనో? నాకు లేదు: పవన్‌
  • ప్రజల్లో నాకు సుస్థిర స్థానం కావాలి: పవన్‌కల్యాణ్‌
  • అన్నీ పనులూ చిటికెలో కావు.. కానీ అయ్యేలా పనిచేస్తాం: పవన్‌
  • మీ పార్టీ కాకపోతే పింఛన్లు తొలగిస్తారని ఆరోపించారు: పవన్‌
  • పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే పింఛన్లు వస్తాయి: పవన్‌
  • వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఆగిపోతాయని ఆరోపించారు: పవన్‌
  • పింఛన్లు ఆగకపోగా పెంచిన పింఛన్లు ఇంటికి చేరుతున్నాయి: పవన్‌

11:40 AM, 1 Jul 2024 (IST)

అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు: పవన్‌

  • భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా: పవన్‌
  • శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నా: పవన్‌ కల్యాణ్‌
  • తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయాలనుకుంటున్నా: పవన్‌ కల్యాణ్‌
  • అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు: పవన్‌
  • రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి: పవన్‌కల్యాణ్‌
  • పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు: పవన్‌కల్యాణ్‌
  • రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్‌ కట్టుకున్నారు: పవన్‌
  • అవే నిధులు ఇక్కడ ఉపయోగిస్తే జిల్లా అభివృద్ధి అయ్యేది: పవన్‌
  • నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు: పవన్‌కల్యాణ్‌
  • పర్యావరణశాఖను బలోపేతం చేస్తాం: పవన్‌కల్యాణ్‌
  • పర్యావరణ కాలుష్యంపై జవాబుదారీతనం తీసుకువస్తాం: పవన్‌
  • గోదావరి పారుతున్నా తాగేందుకు ఇబ్బందులున్నాయి: పవన్‌
  • గతంలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులున్నా ఉపయోగించలేదు: పవన్‌
  • గతంలో కనీసం మ్యాచింగ్‌ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు: పవన్‌

11:17 AM, 1 Jul 2024 (IST)

గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌

మూడు రోజులు కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటన జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు పవన్​ కళ్యాణ్​ గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీని కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.30 వరకు పింఛన్ల పంపిణీలో పవన్‌ పాల్గొననున్నారు. మధ్యాహ్నం నుంచి పిఠాపురం జనసేన నాయకులతో పవన్‌ సమావేశం నిర్వహిస్తారు. రేపు కాకినాడ కలెక్టరేట్‌లో కీలక శాఖలతో పవన్‌ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం ఉప్పాడ తీరంలో సముద్ర కోత సమస్యను పరిశీలించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Pensions_Distribution_in_AP
Pensions_Distribution_in_AP (ETV Bharat)

10:43 AM, 1 Jul 2024 (IST)

1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్‌ మధ్య ఆసక్తికర సంభాషణ

గతంలో పరదాల సీఎంను మనం చూశామని ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌, చంద్రబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది.

అధికారులు సెట్‌ అయ్యేందుకు ఇంకా టైమ్‌ పడుతుందనుకుంటా సర్‌.. ఇంకా పరదాలు కడుతున్నారు అని లోకేశ్‌ అనగానే.. లేదు సెట్‌ అయ్యారని చంద్రబాబు బదులిచ్చారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని.. బతిమిలాడి తీయిస్తున్నామని లోకేశ్‌ చెప్పారు. మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టినవారిని సస్పెండ్‌ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని సీఎం అన్నారు.

"ఎవరైనా సరే పాత రోజులు మరిచిపోవాలి. ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవు. రివర్స్‌ పోయే బండిని పాజిటివ్‌ వైపు నడిపిస్తున్నాం. స్పీడ్‌ పెంచడం తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి ఎవరికీ ఉండకూడదు. ఆ ఆలోచనే రాకూడదు. అలా ఉండకపోతే ఒక్క షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తే అందరూ సెట్‌ అయిపోతారు. దానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రారంభం కాబట్టి స్లోగా వెళ్తున్నా.. ఇక స్పీడ్‌ పెంచాలి. ఈ ప్రభుత్వంలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. చరిత్ర గుర్తు పెట్టుకోవాలి. నువ్వు కూడా అప్పట్లో కుర్రాడివి. నీకు కూడా ఐడియా లేదు. అప్పట్లో హైదరాబాద్‌ నుంచి బయల్దేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్‌ అలర్ట్‌ ఉండేది. ఇప్పుడు అంతలా ఉండదు కానీ.. తప్పు చేస్తే మాత్రం ఎవర్నీ వదిలిపెట్టను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి"’అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం, మంత్రి లోకేశ్‌ మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో సభలో నవ్వులు పూశాయి.

9:39 AM, 1 Jul 2024 (IST)

నెల్లూరు జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు

నెల్లూరు జిల్లాలో పింఛన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 8,500 ఉద్యోగులు పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 313757 మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

8:38 AM, 1 Jul 2024 (IST)

అనంతపురంలో మొదలైన పింఛన్ల పండగ

అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి వెళ్లి.. పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ 7 వేల రూపాయలు అందించారు. ఈ సందర్భంగా పింఛన్‌ పెంచినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

8:37 AM, 1 Jul 2024 (IST)

వైఎస్సార్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్న పింఛన్ల పంపిణీ

వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు పాత బకాయి కలిపి 7వేల రూపాయలు ఇవ్వడం ఆనందంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు.

8:32 AM, 1 Jul 2024 (IST)

కోనసీమ జిల్లాలో ప్రారంభమైన పింఛన్ల పంపిణీ

కోనసీమ జిల్లా వ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. రామచంద్రపురం నియోజవర్గంలో పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. అమలాపురం, పి గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట మండపేట ఎమ్మెల్యేలు వాళ్లు నియోజకవర్గ పరిధిలో పింఛన్లు పంపిణీ చేశారు. 3వేల రూపాయల పింఛన్‌ను 4వేల రూపాయలు చేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

Pensions Distribution in_AP_Live_Updates
Pensions Distribution in_AP_Live_Updates (ETV BH)

8:11 AM, 1 Jul 2024 (IST)

ఆర్థిక అసమానతలు లేని సమాజానికి శ్రీకారం చుట్టాం: సీఎం

  • అభివృద్ధి చేసినప్పుడు నన్ను గుర్తించట్లేదు.. తర్వాత గుర్తిస్తున్నారు: చంద్రబాబు
  • నన్ను అరెస్టు చేస్తే హైదరాబాద్‌లో కూడా నిరసనలు తెలిపారు: చంద్రబాబు
  • ప్రజలు ఇచ్చిన సీట్లు దిల్లీలో మన పరపతి పెంచేందుకు ఉపయోగపడింది: చంద్రబాబు
  • ఐదేళ్లు ప్రజల మధ్యకు వచ్చి సీఎం మాట్లాడడం చూశారా?: చంద్రబాబు
  • పింఛన్లు తీసుకున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి: సీఎం
  • ప్రభుత్వానికి శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చే అవకాశం: సీఎం
  • ప్రజా ప్రభుత్వం ఉంది.. నిరంతరం మీకోసం పనిచేస్తాం: సీఎం
  • ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వానికి సహకరించాలి: సీఎం
  • ఆర్థిక అసమానతలు లేని సమాజానికి శ్రీకారం చుట్టాం: సీఎం
  • గతంలో ప్రజల బతుకులను రివర్స్ చేశారు.. కోలుకుని మళ్లీ ముందుకెళ్లాలి: సీఎం
  • అందరూ సమష్టిగా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
  • సంపద సృష్టిస్తాం.. ఆదాయం పెంచుతాం.. పెంచిన ఆదాయం పంచుతాం: సీఎం

8:11 AM, 1 Jul 2024 (IST)

పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల సహాయం కూడా తీసుకోవాలని చెప్పా: సీఎం

  • గతంలో సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ తమ వల్ల కాదన్నారు: సీఎం
  • పింఛన్ల పంపిణీ చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని ఆనాడే చెప్పా: సీఎం
  • 1.25 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ: సీఎం
  • పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల సహాయం కూడా తీసుకోవాలని చెప్పా: సీఎం
  • అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేరోజు ఐదు సంతకాలు పెట్టా: సీఎం
  • డీఎస్సీ ద్వారా 16,500 టీచర్ల నియామకం చేపడతాం: సీఎం
  • వీలైనంత త్వరలో టీచర్ల నియామకం చేపట్టే బాధ్యత తీసుకుంటా: సీఎం
  • ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుపై రెండో సంతకం పెట్టా: సీఎం
  • ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుతో మీ భూములు ఇతరులు రాసుకునే పరిస్థితి: సీఎం
  • అన్న క్యాంటీన్‌ పునరుద్ధరణపై మూడో సంతకం పెట్టా: సీఎం
  • రూ.5కే అన్న క్యాంటీన్‌లో భోజనం చేయవచ్చు: సీఎం
  • త్వరలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం: సీఎం
  • యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తాం: సీఎం
  • నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు శిక్షణ అందిస్తాం: సీఎం

7:41 AM, 1 Jul 2024 (IST)

నంద్యాలలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ

నంద్యాలలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. పట్టణంలోని నస్యం వీధిలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ వృద్ధులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మేరకు ఏడు వేల రూపాయలు ఇవ్వడంతో సంతోషంగా ఉందని ఫరూక్ అన్నారు. పెన్షన్ పంపిణీ పండగలా జరుగుతుందన్నారు.

Pensions_Distribution in_AP_Live_Updates
Pensions_Distribution in_AP_Live_Updates (ETV Bharat)

7:33 AM, 1 Jul 2024 (IST)

రాజానగరం నియోజకవర్గంలో ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. రాజానగరం నియోజకవర్గంలోని రాజానగరంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామ కృష్ణ, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి స్వయంగా పింఛను అందించారు. ఇంటింటికి వెళ్తూ బత్తుల బలరామ కృష్ణ, వెంకట రమణ చౌదరి లబ్ధిదారులకు ఫించన్‌ పంపిణీ చేశారు. అలాగే వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. పెండింగ్ బకాయిలు కలిపి 7వేల రూపాయల చొప్పున ఫించన్లు అందజేయడంపై.. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

7:28 AM, 1 Jul 2024 (IST)

ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం

  • ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం
  • ప్రజల జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడింది: సీఎం
  • సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్‌ చెప్పారు: సీఎం
  • ఎన్టీఆర్‌ స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది: సీఎం
  • పేదలపై శ్రద్ధ పెడతాం.. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం: సీఎం
  • ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలనేదే నా ఆలోచన: సీఎం
  • తవ్వుతున్న కొద్దీ నాటి తప్పులు, అప్పులే కనబడుతున్నాయి: సీఎం
  • దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలు చేశాం: సీఎం చంద్రబాబు
  • దివ్యాంగులకు చేయూతనివ్వడం సమాజం బాధ్యత: సీఎం
  • నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉంది: సీఎం

7:28 AM, 1 Jul 2024 (IST)

సామాజిక పింఛన్ల పంపిణీ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు

  • సామాజిక పింఛన్ల పంపిణీ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
  • పెనుమాకలో 2,595 మంది పింఛన్లు తీసుకుంటున్నారు: సీఎం
  • ఒక్క గ్రామంలోనే రూ.1.06 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: సీఎం
  • గుంటూరు జిల్లాలో పింఛన్ల పంపిణీకి రూ.81 కోట్లు ఖర్చు: సీఎం
  • రాష్ట్రంలో 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: సీఎం
  • రాష్ట్రంలో రూ.4,408 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: సీఎం
  • పెనుమాకలో మిద్దెల మధ్యలో పూరిల్లు చూస్తే బాధేసింది: సీఎం
  • పెనుమాకలో రాములు కుటుంబానికి పింఛన్‌ అందించా: సీఎం
  • రైతు కుటుంబం సాగులో రూ.8 లక్షల మేర నష్టపోయింది: సీఎం
  • రాములు కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చాం: సీఎం
  • బాధితులను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: సీఎం
  • పింఛన్ల కింద ఏడాదికి రూ.33,100 వేల కోట్లు పంపిణీ: సీఎం
  • ఐదేళ్లలో పింఛన్ల పంపిణీకి రూ.1.65 లక్షల కోట్లు ఖర్చు: సీఎం
  • పేదరికం లేని సమాజం చూడాలనేదే నా ఆశయం: సీఎం

7:11 AM, 1 Jul 2024 (IST)

వాస్తవాలను ప్రజలకు చెప్పి అబద్ధాలకోరులను భూస్థాపితం చేస్తాం: సీఎం

  • ప్రజాహితం కోసం అందరూ పనిచేయాలి: సీఎం చంద్రబాబు
  • దగా, మోసంతో ఐదేళ్లపాటు అబద్ధాలతో బతికారు: సీఎం
  • వాస్తవాలను ప్రజలకు చెప్పి అబద్ధాలకోరులను భూస్థాపితం చేస్తాం: సీఎం
  • ఎన్నికలకు ముందు పవన్‌కల్యాణ్‌తో జట్టుకట్టాం: సీఎం
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అవగాహనకు వచ్చాం: సీఎం
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే మూడు పార్టీల కలయిక: సీఎం
  • ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలదొక్కుకోవాలనే కలయిక: సీఎం
  • మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా కాదు: సీఎం
  • మాకు ప్రజలు బాధ్యత ఇచ్చారు.. అధికారం కాదు: సీఎం

7:06 AM, 1 Jul 2024 (IST)

వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లపాటు ప్రజలను అణగదొక్కారు: సీఎం

  • కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీ చేపట్టాం: సీఎం
  • మీ అందరి ఆశీస్సులతో నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేశా: సీఎం
  • గత ఎన్నికల్లో లోకేశ్ ఓడినా మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేశారు: సీఎం
  • మీ అందరి అభిమానం చూరగొని లోకేశ్ ఇక్కడి నుంచి పోటీ చేశారు: సీఎం
  • గాజువాక, భీమిలిలో మంచి మెజారిటీతో గెలిపించారు: సీఎం
  • మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీతో లోకేశ్ను గెలిపించారు: సీఎం
  • ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే: సీఎం
  • రాత్రికి రాత్రే అద్భుతాలు జరగాలని అందరూ ఆలోచిస్తున్నారు: సీఎం
  • వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లపాటు ప్రజలను అణగదొక్కారు: సీఎం
  • నిజమైన స్వాతంత్య్రం వచ్చిందనే ఆనందంలో ప్రజలు ఉన్నారు: సీఎం
  • రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదు: సీఎం
  • పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొల్పారు: సీఎం
  • గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతింది: సీఎం

Pensions Distribution in_AP_Live_Updates (ETV Bharat)

6:55 AM, 1 Jul 2024 (IST)

పొన్నూరు క్యాబిన్‌పేటలో పింఛన్ల పంపిణీ

  • గుంటూరు: పొన్నూరు క్యాబిన్‌పేటలో పింఛన్ల పంపిణీ
  • లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
  • గుంటూరు మణిపురం రోడ్డులో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్

6:54 AM, 1 Jul 2024 (IST)

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం

  • ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం
  • లబ్ధిదారుకు స్వయంగా పింఛన్‌ అందజేసిన సీఎం చంద్రబాబు
  • పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్‌ అందజేసిన సీఎం చంద్రబాబు
  • పింఛన్‌ లబ్ధిదారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
  • ఇంటింటికీ వెళ్తూ స్థానికులను పలకరిస్తోన్న చంద్రబాబు
  • స్థానికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న చంద్రబాబు

6:34 AM, 1 Jul 2024 (IST)

పింఛన్‌ లబ్ధిదారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

  • ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం
  • పెనుమాకలో పింఛన్ల పంపిణీ కోసం లబ్ధిదారు ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు
  • పింఛన్‌ లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

6:32 AM, 1 Jul 2024 (IST)

మంగళగిరి నియోజకవర్గం పెనుమాక చేరుకున్న సీఎం చంద్రబాబు

  • మంగళగిరి నియోజకవర్గం పెనుమాక చేరుకున్న సీఎం చంద్రబాబు
  • పెనుమాకలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన స్థానిక ఎమ్మెల్యే
  • కాసేపట్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం
  • సీఎంతో పాటు పింఛన్‌ పంపిణీలో పాల్గొననున్న మంత్రి లోకేశ్
  • పెనుమాకలో లబ్ధిదారులకు పింఛను చేయనున్న సీఎం, మంత్రి లోకేశ్
  • స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
  • పెనుమాకలో పింఛన్‌ లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడనున్న సీఎం
  • ఒకే రోజు 65.18 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం
  • 65.18 లక్షల మందికి రూ.4,408 కోట్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం
  • రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న ప్రజాప్రతినిధులు

6:30 AM, 1 Jul 2024 (IST)

పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
  • మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం పింఛన్లు పంపిణీ
  • లబ్ధిదారులకు రూ.7 వేల పింఛన్‌ అందించనున్న సీఎం చంద్రబాబు
  • పెరిగిన పింఛను, బకాయిలు కలిపి రూ.7 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం
  • పెనుమాకలో పింఛన్‌ లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడుతున్న సీఎం
  • ఒకే రోజు 65.18 లక్షల మందికి పింఛన్లు పంపిణీ
  • 65.18 లక్షల మందికి రూ.4,408 కోట్లు పంపిణీ
  • రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

Last Updated : Jul 1, 2024, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.