Pension Distribution Issue in AP : సీఎం జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలకు పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే విధంగా సర్వాధికారులు ఉన్నా వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. పండుటాకులను మండుటెండల్లో మలమలమాడిపోయేలా వ్యూహం పన్నారు. ఈ పాపమంతా ఎవరిది జగన్‌ది కాదా. 46 డిగ్రీలను మండుటెండల్లో వృద్ధులు, వితంతువులను ఒంటరి మహిళలకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేకుండా వారిపై కక్ష సాధిస్తున్నారు.
ఈ పాపం జగన్‌దే - అవ్వాతాతల ప్రాణాలు పణంగా పెట్టి రాజకీయాలు? - Pensioners FACING PROBLEMS
Pensioners Problem : గత నెల సచివాలయ కార్యాలయంలో పింఛన్ పంపిణీలో జరిగిన లోటుపాటులను సరిచేయలసిన అధికారులు వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టారు. బ్యాంకు ఖాతాల్లో జమ చేశాము అంటూ వారిని నానా అవస్థలు పడేలా చేశారు. బ్యాంకుల్లో వృద్ధులు కూర్చోవడానికి సరిపడా కుర్చీలు లేక, గంటల తరబడి నిల్చోలేక నరకయాతన అనుభవించారు. కొన్ని చోట్ల బ్యాంకులు నిండిపోవడంతో తలుపులు మూసి వృద్ధుల్ని బయటే ఎండలో నిలబడేలా చేశారు. ఇలా ఒకటి, రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా పింఛనుదారుల్ని నానా కష్టాలు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందారు.
ఒకటో తేదీ వస్తోంది - ఈసారైనా ఇంటి వద్దే పింఛన్లు ఇస్తారా ? - Pension Distribution Issue
Shashi Bhushan Kumar Comment Pension Distribution : పింఛన్ల కోసం రూ. 1945 కోట్ల ప్రభుత్వం విడుదల చేసిందని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో మెుత్తం 65 లక్షల 49 వేల 864 మంది పింఛన్ లబ్ధిదారులు ఉంటే అందులో 63లక్షల 31 వేల 470 మందికి పింఛన్లు పంపిణీలు పూర్తి చేశామని వెల్లడించారు. 15,13,752 మందికి ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేశామన్నారు. డీబీటి కింద 48,17,718 మంది పింఛన్‌దారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేశామని పేర్కొన్నారు. 74,399 మందికి బ్యాంకు ఖాతాలకు మొబైల్ అనుసంధానం కాకపోవడం వల్ల పింఛన్ డబ్బులు జమ కాలేదన్నారు. సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటి పింఛన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మే 4 తేదీన ఇంటింటికీ పింఛన్ పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు.