ETV Bharat / state

పంప్​ హౌస్​ ఇంజినీర్ల విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నిర్ణయం - Judicial Inquiry On Kaleshwaram

PC Ghose Committee on kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో జస్టిస్ ఘోస్ కమిషన్​ వేగం పెంచింది. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని పంప్​ హౌస్​లకు చెందిన నీటిపారుదల శాఖ ఇంజినీర్లను జస్టిస్​ పీసీ ఘోష్​ విచారణ చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని దస్త్రాలు ఇవ్వాలని కమిషన్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్​ ఆదేశించింది.

PC Ghose Committee on kaleshwaram
PC Ghose Committee on kaleshwaram (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 5:46 PM IST

Updated : Jul 6, 2024, 6:39 PM IST

Judicial Inquiry On Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌస్​లకు చెందిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లను కూడా జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేయనున్నారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్‌ల ఇంజినీర్లను విచారణ చేయాలని కమిషన్ నిర్ణయించింది. సోమవారం నుంచి మూడు పంప్ హౌస్​లకు చెందిన సీఈ నుంచి ఏఈఈ వరకు ఇంజినీర్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

కాళేశ్వరం విచారణపై పీసీ ఘోష్ కమిషన్ : ఇంజినీర్ల నుంచి కూడా అవసరమైన సమాచారం, వివరాలు సేకరించడంతో పాటు ఆ తర్వాత వారి నుంచి కూడా అఫిడవిట్లు తీసుకోనున్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది. రెండు వారాల్లోగా అన్ని దస్త్రాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖకు స్పష్టం చేసింది. తుది నివేదికలు ఇవ్వాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఎన్డీఎస్ఏ ఛైర్మన్​తో ఆయన మాట్లాడినట్లు సమాచారం.

నిపుణుల కమిటీ సభ్యలతో జస్టిస్​ పీసీ ఘోష్ సమావేశం : పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్​కు కమిషన్ ఓ ప్రతినిధిని పంపి అధ్యయనం చేయించింది. కమిషన్‌కు సహాయకారిగా ఉండేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశమయ్యారు. కమిటీ ఇప్పటికే ఆనకట్టలను అధ్యయనం చేసినందున ఆ అంశాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.

నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇప్పటి వరకు ఇచ్చిన అఫిడవిట్ల పరిశీలన కొనసాగుతోంది. వాటి పరిశీలన తర్వాత అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేయనున్నారు.

ఆచితూచి వ్యవహరిస్తున్న అధికారులు : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ప్రక్రియలో భాగంగా కమిషన్​కు ఎవరు ఏం చెప్పినా ప్రతీదీ రికార్డు రూపంలో ఉండాలని ఇప్పటికే జస్టిస్​ పీసీ ఘోష్ వెల్లడించారు. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్​ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరగాయన్న వివరాలు రికార్డు రూపంలో వచ్చిన నేపథ్యంలో విచారణను వేగవంతం చేయనున్నారు.

నేటి నుంచి కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ తదుపరి ప్రక్రియ ప్రారంభం - 10 రోజుల పాటు సాగే అవకాశం!

మేడిగడ్డకు పెరిగిన వరద ఉద్ధృతి - తాత్కాలిక మరమ్మతుకు ఆటంకం - Flood Water Reaches Medigadda

Last Updated : Jul 6, 2024, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.