ETV Bharat / state

ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతుంది: పవన్ కల్యాణ్‌ - Pawan Kalyan Nomination Pitapuram - PAWAN KALYAN NOMINATION PITAPURAM

Pawan Kalyan Nomination in Pitapuram : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలకు బలమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

pawan_kalyan_nomination_in_pitapuram
pawan_kalyan_nomination_in_pitapuram
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 5:29 PM IST

Updated : Apr 24, 2024, 12:24 PM IST

Pawan Kalyan Nomination in Pitapuram : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలకు బలమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అంతకుముందు గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన ఇంటి నుంచి పవన్ భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. యువకులు జనసైనికులు, టీడీపీ, బీజేపీ శ్రేణులు భారీగా జనసేనాని ర్యాలీలో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో జనం పోటెత్తారు. మండుటెండనూ లెక్కచేయకుండా అడుగడుగునా పవన్‌కు ప్రజలు నీరాజనాలు పలికారు. సాయిబాబా గుడి వద్దకు చేరుకోగానే నామినేషన్‌కు సమయం మించిపోతుండటంతో ర్యాలీని మధ్యలో ఆపిన పవన్‌ అక్కడ నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ ర్యాలీలో పిఠాపురం టీడీపీ ఇంచార్జి వర్మ, పవన్ సోదరుడు నాగబాబు, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతుంది: పవన్ కల్యాణ్‌

నామినేషన్ల జోరు, ప్రచార హోరు - పిఠాపురంలో జనసైనికుల సందడి - Political Nominations in Ap 2024

AP Election Nominations 2024 : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరూ ముందుగా నామినేషన్​ దాఖలు చేయాల్సిందే. తమ ఆస్తుల పూర్తి వివరాలు, తమపై నమోదైన కేసులను అందులో వెల్లడించక తప్పదు. ఈ నేపథ్యంలో వేల కోట్లు స్థిర, చరాస్థులు కలిగిన పలువురు అభ్యర్థుల ఆస్తుల వివరాలు తెలిసి ఓటర్లు అవాక్కవుతున్నారు. ఇదిలా ఉండగా, కూటమి అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్​ కళ్యాణ్ ఇవాళ నామినేషన్​ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల కమిషన్​కు నివేదించారు.

పవన్​ ఆస్తుల వివరాలు : పవన్​ వద్ద మొత్తం 11 వాహనాలు ఉన్నాయి. అందులో ఒకటి బైక్​ కాగా మరొకటి పికప్​ ట్రక్,​ మరో 9 కార్లు ఉన్నాయి. పవన్​ 2010 సంవత్సరంలో హార్లే డేవిడ్​ సన్​ బైక్​ కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ బైక్​ ధర 32లక్షల 66వేల 536 రూపాయలు. ఆ తర్వాత 2011లో పవన్​ ఆర్​ క్లాస్​ 360 మోడల్​ బెంజ్​ కారు కొన్నారు. దాని ధర 72లక్షల 95వేల 264 రూపాయలు. ఇక 2014లో మహీంద్రా కంపెనీకి చెందిన ఎస్​ 8 మోడల్​ స్కార్పియోను 13లక్షల 82వేల 240 రూపాయలకు కొనుగోలు చేశారు. 2021లో టాటా యోధా పికప్​ ట్రక్ తీసుకున్నారు. ఆ వాహనం ధర 9లక్షల 19వేల 098 రూపాయలు మాత్రమే. పవన్​ వద్ద ఉన్న వాహనాల్లో అతి తక్కువ ధర దీనిదే కావడం గమనార్హం.

2021లో ఎస్​ క్లాస్​ 560 మోడల్​ బెంజ్​ కారును 2కోట్ల 42లక్షల 06వేల 101 రూపాయలకు పవన్​ కొనుగోలు చేశారు. 2022లో రేంజ్ రోవర్​ స్పోర్స్ట్​ కారును 5కోట్ల 47లక్షల 03వేల 087 రూపాయలకు కొనుగోలు చేశారు. పవన్​ కొనుగోలు చేసిన వాహనాల్లో ఇదే అత్యధిక విలువైనది కావడం విశేషం.

2022 సంవత్సరంలో పవన్​ కళ్యాణ్​ ఆరు కార్లు కొన్నారు. అందులో మొదటిది 2కోట్ల 53లక్షల 70వేల 879 రూపాయలు వెచ్చించి టయోటా కంపెనీ ల్యాండ్ క్రూసర్, టయోటా కంపెనీకి చెందిన వెల్ఫేర్​ కారును కోటీ 11లక్షల 88వేల 854 రూపాయలు పెట్టి కొన్నారు.

పవన్​కు ఎన్ని కార్లు ఉన్నాయంటే!- వాటి ధరెంతో తెలుసా? - pawan kalyan nomination

Last Updated : Apr 24, 2024, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.