ETV Bharat / state

మద్య నిషేధం అన్నారు - సారా వ్యాపారం చేస్తున్నారు: పవన్​ కల్యాణ్​ - Pawan Kalyan Key Comments - PAWAN KALYAN KEY COMMENTS

Pawan Kalyan Key Comments: జగన్‌ పాలనలో పేదలు, సామాన్య ప్రజల పొట్టకొట్టారని పవన్‌ ఆరోపించారు. ఉపాధిహామీ అక్రమాలు, కేంద్ర నిధులు దారి మళ్లించి దోచుకున్నారని మండిపడ్డారు.పెడన ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన చేనేత, కళంకారీ ప్రజలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు ఆదుకునేలా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీదారులను శిక్షిస్తామన్నారు.

Pawan Kalyan Key Comments
Pawan Kalyan Key Comments
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 9:53 PM IST

Pawan Kalyan Key Comments: వైఎస్ జగన్​ను భయపెట్టే భారీ మెజారిటీ ప్రజలు కూటమి అభ్యర్థులకు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను కూటమి ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుందని ఉద్ఘాటించారు. పెడన, మచిలీపట్నంలలో నిర్వహించిన ప్రజాగళం భహిరంగ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ అదే మద్యం లో 40వేల కోట్లు దోచుకున్నాడని పవన్ ధ్వజమెత్తారు. మద్య నిషేధం చేయకపోగా కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలు హరిస్తున్న వైసీపీని తన్ని తరిమేయాలన్నారు.

పెడన ఎమ్మెల్యే పెనమలూరు పారిపోయాడు: ఒడిపోతున్నాననే బాధతో జగన్ చాలా కోపంగా ఉన్నాడని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అరాచకం చేసిన వైసీపీ రౌడీలను మాత్రం వదలదని పవన్ హెచ్చరించారు. పెడన సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు ఉచ్చరించటం కూడా తనకిష్టం లేదని పవన్ వ్యాఖ్యానించారు. భీమవరం జనసేన సీటు గురించి మాట్లాడిన జగన్, పెడన ఎమ్మెల్యే ఎందుకు పెనమలూరు పారిపోయాడో సమాధానం చెప్తాడా అని ప్రశ్నించారు. తన పాలన మీద నమ్మకం ఉంటే 70మంది ఎమ్మెల్యేలను జగన్ ఎందుకు మార్చాడని నిలదీశారు. తమ కులానికి చెందిన నేతలతోనే తమను తిట్టిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని రామరాజ్యం వైపు నడిపించేందుకే కూటమి ఏర్పాటు- పవన్ కల్యాణ్ - Pawan Bforms to Janasena Candidates

ప్రతీ వర్గం పొట్టగొట్టడమేనా: మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు జీవో 217 తెచ్చారని పవన్ ఆరోపించారు. భవన సంక్షేమ కార్మికుల నిధులను కూడా దారి మళ్లించారని తెలిపారు. ఉపాధి హామీ కూలీలు, చేనేత సంఘాలు ఇలా ప్రతీ వర్గం పొట్టగొట్టడమేనా జగన్ చెప్పే క్లాస్ వార్ అని మండిపడ్డారు. పెడన లో ఎమ్మెల్యే చేసిన అవినీతికి లెక్కే లేదని దుయ్యబట్టారు. నోరునే ఒక డ్రైనేజీగా వాడుకునే ఎమ్మెల్యే పెడన లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచలేదని ఎద్దేవాచేశారు. నమస్కారం పెట్టలేదనే కోపంతో గంజాయి కేసులు పెట్టించిన ఘనుడు పెడన ఎమ్మెల్యే అని ఆక్షేపించారు. పెడనలో 18 వేల మంది కలంకారీ, చేనేత కార్మికులు ఉన్నారని, కూటమి కళంకారీ కార్మికులకు అండగా ఉండి వారి హక్కులు కాపాడుతుందని హామి ఇచ్చారు.

మత్స్యకారులకు జెట్టీలు ఏర్పాటు చేస్తాం: సీపీఎస్ రద్దు అంశంపై ఏడాదిలోగా పరిష్కారం చూపుతామని జనసేనఅధినేత పవన్ కల్యాణ్ హామిఇచ్చారు. టీచర్లను గౌరవిస్తామన్నారు. పెడన కలంకారీ కళను రక్షించేందుకు కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక చట్టాలు తెస్తామని స్పష్టంచేశారు. కూటమి నేతలు తమలో తాము కొట్టుకోవాలని జగన్ చాలా ఆశ పడుతున్నారని,జగన్ ఆశ నెరవేరదని తేల్చిచెప్పారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి సారా వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారులకు జెట్టీలు ఏర్పాటు చేస్తామని పవన్ హామిఇచ్చారు.

నవరత్నాలు కాదు - నకిలీ రత్నాలు : చంద్రబాబు - Chandrababu criticized YCP MLAs

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.