Pawan criticizes YSRCP govt: ఈనెల 30న ఎన్డీయే కూటమి మేనిఫెస్టో ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొన్న పవన్, వైసీపీపై నిప్పులు చెరిగారు.పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి మాత్రం పక్క జిల్లాల్లో దోచుకోవచ్చు కానీ, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి జిల్లాలోకి బయటవాళ్లను రానివ్వరని విమర్శించారు.
వంతాడ అక్రమ మైనింగ్‌ను క్రమబద్ధీకరిస్తామని పవన్ హామీ ఇచ్చారు, గిరిజనుల గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తానని తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆధునిక ఆస్పత్రులు నిర్మించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ విద్యాసంస్థలను పునరుద్ధరిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.450 కోట్లు దోచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, రోడ్లుపై ప్రయాణించాలంటే వెన్నెముక విరిగేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని పవన్ కల్యాణ్ ఆరోపించారు. జగన్ సారా అమ్ముతూ రూ.40వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ద్వారంపూడి ప్రత్తిపాడులో అడుగుపెట్టాలంటే వందసార్లు ఆలోచించాలని ఎద్దేవా చేశారు. జనసైనికులకు ఉన్న దమ్ము, ధైర్యం వల్లే గూండా పార్టీని తట్టుకుంటున్నానని తెలిపారు. నాసిరకం మద్యం సరఫరా చేస్తూ కిడ్నీలు, నరాలు దెబ్బతినేలా చేస్తున్నారని పవన్ ఆరోపించారు. మద్యం నిషేధిస్తామని, ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని ఎద్దేవా చేశారు. ఏపీలో ఏ మూలకు వెళ్లినా గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని తెలిపారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యమని తెలిపారు.
ఈ ఐదేళ్లలో రూ.200 కోట్లు సంపాదించానని పవన్ తెలిపారు. తనకు డబ్బు అవసరంలేదన్న పవన్, కష్టాల్లో ఉన్న రైతు కన్నీరు తుడిస్తేనే తనకు అనందం ఉంటుందన్నారు. మబ్బుల్లో పరుగెత్తే పిడుగుల్లాంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే తనకు ఆనందమన్నారు. ఓడిపోయినా దశాబ్దం పాటు రాజకీయాల్లో ఉన్నానంటే యువత భవిష్యత్ కోసమే అని పవన్ పేర్కొన్నారు. నాకు చప్పట్లు కొట్టి వెళ్లిపోతే కాదు - ఎన్డీయే కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టమని తెలిపాడు. అసెంబ్లీలో జనసేన గొంతు వినిపిస్తే ఆ శక్తి వేరుగా ఉంటుంది. దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకుని ఓట్లు అడిగే హక్కు లేదని చలమలశెట్టి సునీల్‌కు చెప్పాలన్నారు. ప్రధాని దగ్గర తాను ధైర్యంగా మాట్లాడగలను, జగన్ మాట్లాడాలంటే భయం అంటూ ఎద్దేవా చేశాడు. తనపై ఉన్న కేసులు కొట్టేయమని మాత్రమే అడుగుతారని పవన్ విమర్శించారు.
కిర్లంపూడి సభలో మాట్లాడిన పవన్ వైసీపీ ప్రభుత్వం విరుచుకుపడ్డారు. టీఏ, డీఏల కింద పోలీసులకు రూ.750 కోట్లు ఇవ్వాలని గుర్తుచేశారు. సీపీఎస్ గురించి మా మేనిఫెస్టోలో చెబుతామని పేర్కొన్నారు. ఈ రోజుల్లో యువతను కులమతాల గురించి అడగకూడదని, మీలో ఏం నైపుణ్యం ఉందో చెప్పాలని యువతను అడగాలని పవన్ సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత మన యువత వలసలు వెళ్తున్నారన్న పవన్, మా రాష్ట్రానికి మేలు చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశానని వెల్లడించారు.
ప్రజలే పవన్ కల్యాణ్‌కు కుటుంబసభ్యులు: వరుణ్ తేజ్ - Varun Tej Election Campaign