ETV Bharat / state

ఆ పెద్దాసుపత్రిలో డాక్టర్​ను కలవాలంటే 'ఓపి'క పట్టాల్సిందే - నీరసించిపోతే కింద కూర్చోవాల్సిందే! - Nalgonda Govt Hospital op Problems

author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 5:10 PM IST

Nalgonda Govt Hospital Problems : నల్గొండ జనరల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ అనారోగ్య సమస్యలతో అసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే ఉంటున్నాయి. ఓపీ సేవలు అందక, గంటల కొద్దీ వరుసల్లో నిలబడలేక బాధితులు నీరసించిపోతున్నారు.

Patients Heavy Rush in Nalgonda Govt Hospital
Patients Heavy Rush in Nalgonda Govt Hospital (ETV Bharat)
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఓపీ కష్టాలు - గంటల కొద్దీ క్యూలైన్‌లోనే? (ETV Bharat)

Patients Heavy Rush in Nalgonda Govt Hospital : నల్గొండ సర్కారు ఆసుపత్రిలో ఓపీ సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో బాధితులు వస్తుండటంతో ఓపీలు అందించలేకపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఓపీ సేవలు ఉండటంతో సుదూరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు వెనుదిరగాల్సి వస్తుంది. ఆసుపత్రిలో కూర్చోవడానికి సరిపడా కుర్చీలు కూడా లేక, కిందనే కూర్చునే పరిస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు.

కొందరు రోగులు వరుసల్లో నిల్చోలేక, వారి వెంట తోడుగా వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులను తెచ్చుకుంటున్నారు. ఊళ్ల నుంచి రావడం ఒక ఎత్తైతే, ఓపీ సేవల వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాయడం మరో ఎత్తు అవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో కేవలం రెండే ఓపీ కౌంటర్లు ఉన్నాయని, వరుసల్లో గంటల కొద్దీ నిలపడినా, ముందు వరుసలో ఉన్నవాళ్లకే అవకాశం వస్తోందని, ఓపీ సమయం, కౌంటర్ల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

"ఉదయం 9 గంటలకు వచ్చి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఉన్నా, ఓపీ సేవలు దొరకడం లేదు. కూర్చోవాలనుకున్నా కుర్చీలు లేవు. చాలా మంది కిందనే కూర్చుంటున్నారు. అత్యవసరం అయినా సరే ఓపీ వేగంగా దొరకడం లేదు. ఓపీ క్యూలైన్లను ఇంకో రెండు పెంచితే బాగుంటుంది. ఆధార్‌ కార్డు కాకుండా ఫింగర్‌ ప్రింట్‌ కూడా ఉండాలి అంట ఓపీ కోసం. అందుకే ప్రభుత్వం స్పందించి, దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలి." - రోగులు

ప్రతిరోజు 700 వరకు ఓపీలు ఇస్తున్నాం : ఆసుపత్రిలో రోజుకు 700 వరకు ఓపీలు ఇస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ప్రధానంగా జ్వరం, ఆస్తమా, గైనక్‌ సంబంధించిన కేసులు ఎక్కువగా వస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇటీవల వాతావరణంలో మార్పు రావడంతో నాలుగైదు రోజుల నుంచి జ్వరం కేసుల సంఖ్య పెరిగినట్లు వైద్యులు పేర్కొన్నారు.

"ప్రతి రోజు 700 వరకు ఓపీలు ఇస్తున్నాం. ఇలా క్యూలైన్లలో రోగులు నిలబడితే సమస్య అవుతుందని చెప్పి స్కిప్‌ ద క్యూ అనే ప్రోగ్రాం పెట్టాం. మీ మొబైల్‌ ఫోన్లలో అబా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, అందులో ఓపీ సేవలను పొందవచ్చు. ఈ విధంగా చేస్తే డైరెక్టుగా వైద్యులను కలవొచ్చు. ఓపీ క్యూలైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. రెండు, మూడు రోజుల నుంచి వాతావరణం బాగోకపోవడం వల్ల ఆసుపత్రికి జ్వరాలకు సంబంధించి ఎక్కువ మంది వస్తున్నారు. అన్ని డిపార్టుమెంట్లకు కలిపి ప్రతి రోజు 1000 మంది వస్తున్నారు." - ఓపీ అధికారి

'ఆస్పత్రుల్లోని క్యాంటీన్లకు పెండింగ్​ బిల్లులు చెల్లించట్లేదు - ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగులు, వైద్యులకు ఆహారం అందట్లేదు' - BRS MLA Harishrao Tweet on TG Govt

వసతులున్నా, వైద్యులేరీ? - అచ్చంపేట ఏరియా ఆసుపత్రి దుస్థితిపై ప్రత్యేక కథనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.