ETV Bharat / state

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును చూసి ప్రయాణికులంతా షాక్​ - ఎందుకంటే? - PRIVATE TRAVEL BUS IN BHADRACHALAM

బస్సు అద్దం లేకుండానే హైదరాబాద్‌కు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు - ప్రశ్నించిన ప్రయాణికులపై ఎదురు దాడికి దిగిన బస్సు డ్రైవర్‌

PRIVATE TRAVEL BUS
ముందు భాగంలో అద్దం లేని బస్సు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 5:22 PM IST

Updated : Dec 9, 2024, 5:56 PM IST

Private Travel Bus in Bhadrachalam : బస్సుకు ముందు భాగంలో అద్దం లేకుండా ప్రయాణికులను తీసుకువెళ్దామని ప్రయత్నించిన బిఎస్​ఆర్​ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ప్రయాణికులంతా అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌కు ప్రయాణికులను తీసుకువెళ్తోంది. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు బస్సుకు ముందు అద్దం లేకపోవడంతో ఇదేంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులను ప్రశ్నించారు.

అయితే అద్దం లేదని ప్రశ్నించిన ప్రయాణికులకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ డ్రైవర్ గొడవకు దిగడంతో ప్రయాణికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సులో ప్రయాణం చెయ్యలేమని చెప్పిన కొందరు ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇవ్వగా ఇంకొందరిని పాల్వంచలోకి వెళ్లగానే వేరే బస్సు ఎక్కిస్తామని చెప్పి తీసుకెళ్లారు.

అధిక ఛార్జీలు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రతిరోజు రాత్రి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్​కు నడుపుతున్నారు. ఆర్టీసీ బస్ ఛార్జీ రూ. 500 నుంచి రూ. 800 వరకు ఉండగా, ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలు రూ. 1000 నుంచి రూ. 2వేల వరకు వసూలు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో మరి అధికంగా టికెట్ల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. కానీ సరైన సదుపాయాలు, అనుమతులు లేకుండా బస్సులు నడుపుతున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముందు భాగంలో అద్దం లేకుండా బస్సును డ్రైవర్​ ఎలా నడుపుతారు? బీఎస్​ఆర్​ ట్రావెల్స్​ ఈ బస్సును ఎలా తీస్తారు? ఇది 30 సీట్ల కెపాసిటీతో ఉన్న బస్సు మామూలు స్పీడ్​తో అయినా వెళ్తుంటే అందరికీ ఎలా ఉంటుంది. బస్సులో ఎప్పుడు ఇలాంటి మార్క్​ లేదని నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. - ఓ ప్రయాణికుడు

టికెట్లు ముందుగా బుక్​ చేసుకున్న ప్రయాణికులు భద్రాచలం నుంచి హైదరాబాద్​కు బయలుదేరే బస్సు ఎక్కడానికి వచ్చారు. ముందు అద్దం లేకపోవడంతో ఒక్కసారిగా బస్సును చూసి భయాందోళనలకు గురయ్యారు. ఇలా ఉంటే ఎలా ప్రయాణం చేయాలని ప్రశ్నించిన ప్రయాణికులపై డ్రైవర్ గొడవకు దిగాడు. వెంటనే ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్కువ ధరలకు సురక్షితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ ప్రైవేట్ బస్సుల దందా భద్రాచలంలో జోరుగా సాగుతుందని, కొంతమంది అనుమతులు లేని బస్సులతో వ్యాపారం చేస్తున్నారని వాటిని ఆపివేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రయాణికులతో వెళ్తున్న బస్సును సడెన్​గా నిలిపివేసిన డ్రైవర్ - ఏమైందంటే?

ఫ్లై ఓవర్​పై డివైడర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Last Updated : Dec 9, 2024, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.