ETV Bharat / state

అమ్మానాన్నకు మళ్లీ పెళ్లి - ఇంటికి చేరిన ఆ చిన్నారి - Parents Remarried for Baby

A Couple Married Again in Prakasam District : ఆ జంట మళ్లీ పెళ్లి చేసుకుంది. అదేెంటి మళ్లీ రెండోసారి వివాహం ఏంటని అనుకుంటున్నారా? ఇక్కడే ఓ ట్విస్ట్​ ఉంది. మరి అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Parents Remarried for Baby
Parents Remarried for Baby (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2024, 12:30 PM IST

Parents Remarried for Baby : ఆ జంటకు ఇది వరకే వివాహమైంది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ చేసుకుంది. అమ్మాయి మైనర్ అని పోలీసులకు తెలియడంతో భర్తను అరెస్ట్ చేశారు. ఆమె అప్పటికే గర్బిణి. ఈ క్రమంలోనే ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ చిన్నారిని శిశుగృహకు అప్పగించారు. అలా ఆ చిన్నారి అమ్మ ప్రేమతో తండ్రి లాలనకూ దూరమైంది. ఇలా ఆ బాలిక అందరూ ఉన్నా ఓ అనాథలా మారింది. చట్టం తన పని తాను చేసుకుపోయే క్రమంలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది.

కానీ చివరికి ఏడాది పాటు అక్కడే పెరిగి కలెక్టర్‌ చొరవతో తిరిగి అమ్మ ఒడికి చేరుకుంది ఆ చిన్నారి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలానికి చెందిన భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తికి నందినితో 2022లో వివాహం జరిగింది. అప్పటికే గర్భం దాల్చిన నందిని మైనర్‌ అనే విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో భాస్కర్​రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఈ క్రమంలోనే నందిని 2023లో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారిని అధికారులు శిశుగృహకు అప్పగించారు. ఇలా ఆ పసికందు తల్లిదండ్రులకు దూరమైంది. పాప తల్లి ప్రస్తుతం మేజర్‌ కావడంతో భాస్కర్‌రెడ్డి ఆమెను చట్టప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆ భార్యాభర్తలు తమ చిన్నారిని తమకు అప్పగించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను కోరారు. ఇందుకు అంగీకరించిన కలెక్టర్‌ సోమవారం నాడు దంపతులకు ఆ పాపను అప్పగించారు.

భావోద్వేగానికి లోనైన దంపతులు : ఈ నేపథ్యంలోనే చిన్నారిని చూడగానే ఒక్కసారిగా ఆ దంపతులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ భావోద్వేగ క్షణంతో వారి కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఆ తల్లి తన పాపను ఎత్తుకొని ఆనందభాష్పాలు రాల్చింది. హృదయాన్ని హత్తుకునేలా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారిణి మాధురి, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు జడ్జి గారు మళ్లీ పెళ్లి చేసుకుని.. ఇలా ముచ్చటపడ్డారు! - Judge Justice Maheshwari Marriage

34 Couples Married Again: రెండోసారి వివాహం చేసుకున్న 34 జంటలు.. ఎక్కడ, ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.