Parents Concern For Mid Day Meals In Shadnagar : మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ఉద్దేశించింది. అలాంటి పథకం కొన్ని పాఠశాలల్లో నాసిరకం పదార్థాలతో నాణ్యత లేకుండా వండి పెడుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను దెబ్బతిస్తున్నారు. కొన్ని చోట్ల నీళ్ల పప్పుచారు, అన్నం ఉడికి ఉడకని విధంగా ఉంటోంది. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వాలు, అధికారులు తగు చర్యలు చేపట్టాలి. కానీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తాజాగా షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలంలోని విఠల పాఠశాలలో పురుగులు, ముక్క పట్టిన మధ్యాహ్న భోజనం బియ్యం చూసి తల్లిదండ్రులు మా కొద్దు బాబోయ్ అంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుని నిలదీశారు.
Mid Day Meals Workers on Strike : సర్కారీ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నభోజనం బంద్.. ఎక్కడో తెలుసా?
Broken Mid Day Meals In Shadnagar : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనంలో(Mid Day Meals) నాణ్యత లోపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం విఠ్యాల జడ్పీహెచ్ఎస్లో చోటు చేసుకుంది. పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశంకు వచ్చిన గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు గదిలో బియ్యంను చూసి బోధన సిబ్బందిని నిలదీశారు. వారితో వాగ్వావాదానికి దిగారు. సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిని తల్లిదండ్రులు నిలదీశారు.
Problems in Mid Day Meal in Warangal : పురుగులు బాబోయ్.. పురుగులు.. మాకొద్దీ 'మధ్యాహ్న భోజనం'
Vittyal ZPHS Mid Day Meals Problems : పాఠశాలలో పురుగులు పట్టిన బియ్యం స్టాక్ చూసి ఇదేమిటని ప్రశ్నించారు. మీ పిల్లలకు ఇలాగే అన్నం పెడతారా ఇవి చూసుకోవడం తెలియదా? అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియక గత్యంతరం లేక పురుగులు పట్టిన భోజనాన్ని అలాగే తింటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణలో ఉపాధ్యాయుల అలసత్వంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనానికి పాఠశాలలో బియ్యం అయిపోవడంతో సమీప రాయికల్ పాఠశాల నుంచి తీసుకువచ్చామని ప్రధానోపాధ్యాయులు రవికుమార్ తెలిపారు.
"సబ్జెక్ట్ బోధించడానికి 7 గురు ఉపాధ్యాయులు ఉన్నారు. 6 - 10 తరగతులు ఉన్నాయి. క్లాస్ బోధిస్తాను దీంతో పాటు ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వహిస్తాను. నాణ్యమైన బియ్యం వచ్చాయి కానీ ఎక్కువ రోజులు కావడంతో పురుగులు అయ్యాయి. మంచి భోజనం అందిస్తాం. పురుగులు పట్టిన బియ్యాన్ని తిరిగి పంపిస్తాం. ఇప్పటికే అధికారులకు ఈ సమస్యను విన్నవించాం."-రవి, విఠ్యాల జడ్పీహెచ్ఎస్, ప్రధానోపాధ్యాయులు
Mid Day Meals Problems In Farooqnagar : విద్యార్థులను ఖాళీ కడుపుతో ఉంచలేకనే బియ్యంను జల్లెడ పట్టి కడిగి శుభ్రం చేసి వంట చేసే వారికి సూచించినట్లు హెచ్ఎం వివరించారు. రాయికల్ నుంచి తెచ్చిన బియ్యంను తిరిగి పంపిస్తామని ఒకటి రెండు రోజుల్లో నాణ్యమైన బియ్యం తీసుకు వస్తామని వంట చేసే వారికి వివరించినట్లు ఆయన చెప్పారు. నాణ్యమైన భోజనం అందిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
"ఈ రోజు మధ్యాహ్నం భోజనంలో పురుగులు వచ్చాయి. ఇలాంటివి జరగకుండా చూడాలి. ఇది వరకు నాణ్యత బియ్యం వచ్చేవి. మా పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశంలో బియ్యం గురించి ఉపాధ్యాయులను అడిగారు. వారు ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు."-శ్వేత, 8వ తరగతి విద్యార్థిని
పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము.. 25 మంది చిన్నారులకు అస్వస్థత!