ETV Bharat / state

ఎదురింటికి వెళ్లాలంటే - 3 కిలోమీటర్లు చుట్టి రావాల్సిందే - PANAGAL VILLAGERS PROBLEM

పానగల్‌ పైవంతెన సమీపంలో గ్రామస్థుల సమస్యలు - యూటర్న్​లు లేకపోవడంతో వాపోతున్న ప్రజలు

Panagal Villagers Problems in Nalgonda
Panagal Villagers Problems in Nalgonda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2025, 1:28 PM IST

Panagal Villagers Problems in Nalgonda : ముక్కు ఎక్కడుంది అంటే తలచుట్టూ తిప్పి చూపించాల్సి వస్తోంది. నల్గొండ జిల్లా నార్కట్​పల్లి అద్దంకి రహదారి - నల్గొండ బైపాస్​లో పానగల్​ పైవంతెన నుంచి కేశరాజుపల్లి చౌరస్తా వరకు ఎక్కడా రోడ్డు దాటకుండా యూటర్న్ మూసి వేశారు. పానగల్​ పైవంతెన సమీపం నుంచి కేశరాజుపల్లి వరకు ఉన్న కాలనీల వారు, వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాల్సిన రైతులు పాడి గేదెలు, మేకలు గొర్రెలతో రోడ్డు దాటాలంటే పానగల్​కు రావాలి. లేదా కేశరాజుపల్లికి వెళ్లాల్సి వస్తోంది.

"పానగల్ పైవంతెన నుంచి కేశరాజుపల్లి వరకు రోడ్డు దాటడానికి యూటర్నులు లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. రోడ్డును పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది." - బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పురపాలిక ఛైర్మన్‌

'రోడ్డు వెయ్యండి బాబు' - ఉన్న రోడ్డును తవ్వేసి కంకర పోశారు - కొత్తది వేయడం మరిచారు - VILLAGE PEOPLE DEMAND FOR ROAD

గతంలో ఇదే దారిలో పైవంతెన సమీపంలో, లెప్రసీ కాలనీ వద్ద, గొల్లగూడ రోడ్డులో యూటర్న్​లు ఉన్నా, ప్రమాదాలు జరుగుతున్నాయని క్రితం సంవత్సరం అధికారులు వాటిని మూసివేశారు. ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పినా, ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.

"పానగల్ పైవంతెన నుంచి కేశరాజుపల్లి వరకు ఉన్న యూటర్నులను మూసి వేయడంతో ఎదురుగా ఉన్న వారిని కలవాలంటే కనీసం 3 కిలో మీటర్లు తిరగాల్సి వస్తోంది. ఎదురుగా వెళ్తే ప్రమాదాలు జరుగుతాయనే భయంతో అంత దూరం వెళ్లాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయం లేక వ్యవసాయదారులు అడ్డదిడ్డంగా రోడ్డు దాటుతుంటే వాహనదారులకు ఇబ్బందిగా ఉంది." - జంజిరాల పిచ్చయ్య, స్థానికుడు

ఎన్నికల కోడ్​ పేరుతో రాత్రికి రాత్రే రోడ్డును తవ్వారు - కానీ కొత్తది వేయడం మరిచారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.