ETV Bharat / state

సమస్తం ఆన్‌లైన్​లో నిక్షిప్తం : తుది దశకు చేరుకున్న సమగ్ర కుటుంబ సర్వే - SAMAGRA KUTUMBA SURVEY UPDATE

తుది దశకు చేరుకున్న సమగ్ర కుటుంబ సర్వే - ఆన్‌లైన్లో నమోదు చేస్తున్న అధికారులు - ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రక్రియ

Online Uploading of Comprehensive Household Survey Details
Online Uploading of Comprehensive Household Survey Details (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 4:34 PM IST

Online Uploading of Comprehensive Household Survey Details : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన తుది దశకు చేరుకుంది. ఏ రోజుకు ఆ రోజు ఎన్యుమరేటర్లు ఇళ్లకు తిరిగి వివరాలు సేకరించి వాటిని ఆన్‌లైన్లో పొందుపరుస్తున్నారు. అలాగే ఇళ్లలో లేని వారికి ఫోన్‌ చేసి మరీ వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నిబంధన ప్రకారం సర్వే చేస్తున్నారు. గ్రామల్లో ఉండి నగరంలో సెటిల్ అయిన వారు సైతం ఇక్కడే తమ వివరాలను ఇస్తున్నారు. అందుకు సంబంధించి ధ్రువపత్రాలను అందిస్తున్నారు.

ఆన్‌లైన్‌ ఎంట్రీ ఆపరేటర్లకు అప్పగింత : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 5 పట్టణాలు, 26 గ్రామీణ మండలాలు ఉన్నాయి. ఈ కుటుంబాల వివరాలను సర్వే చేసేందుకు బ్లాకులుగా విభజించారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 నుంచి 175 వరకు కుటుంబాలను కేటాయించి వివరాలు సేకరించే పనిని ఇచ్చారు. కేటాయించిన ప్రకారం ఎన్యుమరేటర్లు వివరాల సేకరించారు. ఈ నెల 6న సర్వే ప్రారంభం కాగా 8వ తేదీ వరకు కుటుంబాలను గుర్తించి ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. అనంతరం ఇంటింటి సర్వే చేపట్టారు. ఓవైపు సర్వే కొనసాగుతుండగానే మరోవైపు సేకరించిన సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ చేసే పనిని ఆపరేటర్లు ప్రారంభించారు.

'కొందరి ఆచూకీ, చిరునామా తెలియడం లేదు - వారి వివరాలు చెబుతారా ప్లీజ్'

వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు : వారందరికీ లాగిన్లు, పాస్‌వర్డ్‌ ఇచ్చారు. మండల పరిషత్తు, తహసీల్దార్‌ కార్యాలయాలతో పాటు కంప్యూటర్లు ఎక్కువగా ఉన్న ఇతర కార్యాలయాలు, పాఠశాలల్లోనూ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ చేస్తున్నారు. డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లతో పాటు ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సర్వే వివరాలు బయటకు వెళ్లకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. వివరాలు బయకికి వెళ్లకుండా గోప్యంగా ఉంచుతున్నారు. మెదక్‌లో జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన వివరాల నమోదు 70 శాతానికి పైగా పూర్తయింది. మరో మూడు రోజుల్లో సర్వే ఎంట్రీ పూర్తి చేయనున్నారు.

'సమగ్ర కుటుంబ సర్వేలో వారి పూర్తి వివరాలు సేకరించాలి' - ఎన్యూమరేటర్లకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

సొంతూళ్లలోనే కుటుంబ వివరాలు వెల్లడిస్తాం - ఎన్యూమరేటర్లకు చుక్కలు చూపిస్తున్న జనాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.