ETV Bharat / state

ఇక్కడేమో 100 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు - అక్కడ విద్యార్థులు లేకున్నా టీచర్ కేటాయింపు - Govt school students in Telangana

Only One Teacher and 100 Students : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో కొన్ని పాఠశాలకు అవసరం ఉన్నా ఉపాధ్యాయుడిని కేటాయించకపోవడం. మరి కొన్ని చోట్ల అవసరం లేకపోయినా కేటాయింపులు చేయడం జరిగింది. అయితే, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరులో ఉపాధ్యాడి కోసం ఎదురు చూసిన విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి. వంద మంది విద్యార్థులున్న స్కూల్​లో ఒకే ఉపాధ్యాయుడిని కేటాయించడంతో విద్యార్థుల విద్యపై పెనుప్రభావం పడుతుంది.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 10:45 AM IST

Updated : Jul 6, 2024, 11:02 AM IST

Only One Teacher and 100 Students
Only One Teacher and 100 Students (ETV Bharat)
ఇక్కడేమో 100 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు - అక్కడ విద్యార్థులు లేకున్నా టీచర్ కేటాయింపు (ETV Bharat)

Govt School Only One Teacher and 100 Students : కొన్ని ప్రభుత్వ పాఠశాలలు సర్కార్ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలకు అద్దం పడుతున్నాయి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కనుగునంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు బోధన, అభ్యస ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 102 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయడు బోదిస్తున్నాడు. ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియలో పాఠశాలకు ఉపాధ్యాయులు వస్తారనుకున్నప్పటికీ బదిలీల ప్రక్రియ పూర్తవడంతో దోనూరు పాఠశాల ఆశలు సన్నగిల్లాయి.

ఈ ప్రాథమిక పాఠశాలలో ఆరేళ్ల క్రితం 18 మంది విద్యార్థులుండగా అక్కడకి ప్రధానోపాధ్యాయుడుగా వెళ్లిన కాశేట్టి రమేష్ గ్రామస్తుల చొరువతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 102 మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది ముగ్గురు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై నియమించారు. విద్యా సంవత్సరం ముగియడంతో ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలకు వెళ్లిపోయారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఉపాధ్యాయులను పాఠశాలకు కేటాయించడం లేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
మమ్మల్ని వదిలి వెళ్లకండి మాస్టారు - బదిలీపై వెళ్తున్న టీచర్​ చుట్టూ వెక్కివెక్కి ఏడ్చిన విద్యార్థులు - Students Farewell to teacher
ప్రవేట్ పాఠశాలను తలదన్నే రీతిలో పాఠశాలను ఉపాధ్యాయుడు తీర్చిదిద్దినప్పటికీ ఉపాధ్యాయుల సమస్య పాఠశాలను తీవ్రంగా వేధిస్తుంది. మన ఊరు మనబడి లో సర్కారు అన్ని రకాల వసతులకు సమకూర్చింది. విద్యార్థులకు బెంచీలు, మంచి కుర్చీలు, ఫ్యాన్లు మంచినీటి వసతి తదితర వసతులను ఏర్పాటు చేసింది. పాఠశాలలో మంచి గ్రీనరీ పాఠశాల పరిసరాల్లో ఆకట్టుకునే చిత్రాలు విద్యార్థులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ప్రధానోపాధ్యాయుడు రమేష్ వెనుకబడిన విద్యార్థులను గుర్తించి పాఠశాల ముగిసిన తర్వాత ప్రత్యేక చొరవ చూపిస్తూ క్లాసులు తీసుకుంటున్నాడు. ఈ పాఠశాల నుంచి ఇప్పటివరకు గురుకుల పాఠశాలకు సుమారు 40 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఆదర్శ పాఠశాలగా కూడా ప్రభుత్వం గుర్తించింది అయినా ఉపాధ్యాయుల సమస్య వేధిస్తూనే ఉంది.

'ఆరు సంవత్సరాల క్రితం 18 మంది విద్యార్థు మాత్రమే ఉండేవారు. ప్రధానోపాధ్యాయుడి చొరవతో పిల్లల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 102 మంది చదువుతున్నారు. గతేడాది ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై వచ్చి బోధించగా, ఈ ఏడాది వారు తమ తమ బడులకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయుడే మిగిలారు. ఒక్కడే ఉపాధ్యాయుడు ఉండటం వల్ల పిల్లల చదువుపై పెను ప్రభావం పడుతుంది. సరైన ఉపాధ్యాయుల సంఖ్య లేకపోవడంతో స్కూల్ నుంచి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్​కు వెళ్లే పరిస్థితి నెలకొంది. అధికారులు ఇప్పటికైనా ఉపాధ్యాయులను కేటాయించాలి.' గ్రామస్థులు

మరోవైపు, నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్‌ మండలం గట్టుమీది తండా గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ బడిలో గతేడాది నుంచి విద్యార్థులు చేరడం లేదు. వారి హాజరు శాతం సున్నా. ఇటీవలి బదిలీల్లో ఈ పాఠశాలకు ఓ ఉపాధ్యాయుడిని కేటాయించారు. ఆయన గ్రామంలోకి వెళ్లి ఆరా తీయగా, తండాలోని 16 మంది విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపుతున్నారని తెలిసింది.
7 తరగతులు 100 మంది విద్యార్థులు ఒక్కరే టీచర్​ - ఇదీ బదిలీల ఎఫెక్ట్ - SINGLE TEACHER FOR SEVEN CLASSES

Last Updated : Jul 6, 2024, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.