ETV Bharat / state

విజయవాడలో మళ్లీ విరిగిపడ్డ కొండచరియలు - ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు - One Person Died in Landslide - ONE PERSON DIED IN LANDSLIDE

One Person Died in a Landslide at Machavaram: విజయవాడలో కొండచరియలు మీద పడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొండ అంచున చెట్లు నరుకుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పరిశీలించారు. మరోవైపు ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో మద్యం మత్తులో మున్నేరులో దూకి గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

one-person-died-in-a-landslide-at-machavaram
one-person-died-in-a-landslide-at-machavaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 4:43 PM IST

One Person Died in a Landslide at Machavaram : విజయవాడ నడి ఒడ్డున ఉన్న కొండ ప్రాంతాలు నగరవాసులను భయపెడుతున్నాయి. తరచూ కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు కొండ ప్రాంతాలు తడిచి, కొండచరియలువిరిగి పడుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. పది రోజుల క్రితం నగరంలోని సున్నంబట్టీ సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందగా, మరికొందరు గాయాలపాలయ్యారు. తాజాగా నగరంలోని మాచవరం ప్రాంత పరిధిలో కొండ చ‌రియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

మాచవరం ప్రాంత పరిధిలో ఉన్న జి.గోపి కుమార్‌ అనే వ్యక్తి తన ఇంటి పక్కన కొండను ఆనుకుని ఉన్న చెట్టును నరికేందుకు నలుగురు కూలీలను పిలిపించుకున్నారు. మంగళవారం ఉదయం చెట్టు కొమ్మలు నరుకుతున్న సమయంలో బాగా తడిచిన కొండ చరియలు విరిగి కూలీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో విజ్జాడ రాము (55) మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పెద్ద పెద్ద బండ రాళ్లు ఒక్కసారిగా మీద పడడంతో అక్కడ ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది.

విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు - ఐదుకు చేరిన మృతులు - రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం - LANDSLIDES IN VIJAYAWADA

సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

యువకుడి ఆచూకీ కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు : ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో మద్యం మత్తులో మున్నేరులో దూకి గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నందిగామకు చెందిన లారీ డ్రైవర్‌ చంటి, పసుపులేటి రోశయ్య మద్యం మత్తులో మున్నేరు వంతెన పైనుంచి దూకి వరద దాటి ఒడ్డుకు వచ్చేలా పందెం వేసుకున్నారు. రోశయ్య ఈదుకుంటూ ఒడ్డుకొచ్చి చూసేసరికి చంటి నీటిలో గల్లంతయ్యాడు. యువుకుడి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మున్నేరులో జల్లెడ పడుతున్నాయి. గల్లంతైన యువకుడి బంధువులు, స్నేహితులు మున్నేరు ఒడ్డు వద్ద ఎదురుచూస్తున్నారు.

జలదిగ్బంధంలో విజయవాడ - గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం - ఆరుగురు మృతి - HEAVY RAINS IN VIJAYAWADA

రాష్ట్రంలో మరింతగా పెరుగుతున్న వరద నష్టం- అంచనా కమిటీ నియామకం - Flood Damage in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.