Old Couple Marriage in Mahabubnagar : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండా. ఈ పల్లెలో జరిగిన ఓ వివాహ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దశాబ్దాల తరబడి ఒకరికొకరు తోడుగా నిలిచి వైవాహిక బంధాన్ని కొనసాగించిన 80 ఏళ్ల గుగులోతు సామిడా నాయక్, 70 ఏళ్ల లాలి వివాహం చేసుకున్నారు. పిల్లలు, మునివళ్లు, మనువరాళ్ల సాక్షిగా మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సహస్ర చంద్రదర్శన వేడుక నిర్వహించారు.
70 Years Couple Marriage in Telangana : తరలివచ్చిన బంధుగణం సమక్షంలో ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఏడుపదుల వయస్సు దాటిన ఈ జంట మురిసిపోయింది. 60ఏళ్ల వైవాహిక బంధం గుర్తుగా మూడు ముళ్లు వేసి ఆదర్శ జీవితాన్ని కొనసాగిస్తామంటూ తలంబ్రాల వేడుక సాక్షిగా ప్రతినబూనారు.
"మా నాన్న వాళ్లు నలుగురు అన్నదమ్ములు, ఒక చెల్లి కలిసి మెలిసి జీవించారు. ఇవాళ మా తాత, అమ్మమ్మ వాళ్ల 60 ఏళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి మేము అంతా చాలా సంతోషంగా ఉన్నాం. వారి ఆశీస్సులతో మేము మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం." - సంతు, మునిమనువడు
GrandChildren married their grandparent's video : 60 ఏళ్ల క్రితం సామిడా నాయక్, లాలి ఒకరికొకరు ఇష్టపడి నూతన జీవితంలో అడుగుపెట్టారు. నలుగురు కుమారులు, ఓ కూతురికి జన్మనిచ్చారు. కుమారులు, కూతుళ్లకు వివాహాలు చేశారు. ఐతే ఈ వృద్ధ జంటకు వివాహం చేసుకోలేదనే లోటు వీరి జీవితాల్లో ఉండిపోయింది. దీంతో కుమారులు, కూతుళ్లు ముని మనవళ్లు, మనుమరాళ్లు కలిసి వివాహా వేడుకను ఘనంగా నిర్వహించారు. అనంతరం డీజే పాటలకు బంధువులు డ్యాన్స్‌లతో సందడి చేశారు.
"70 సంవత్సరాల వధువు లాలి తమ మనవళ్లు, మనవరాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆమె వారి బంధువుల సమక్షంలో చాలా సార్లు తనకు తాళిబట్టు లేదని బాధపడేది. తన బాధను అర్థం చేసుకున్న బంధువులు ఇవాళ ఘనంగా తాలిబట్టు కట్టించాలనే ఉద్దేశంతో పెళ్లి చేశారు." - రామానందచారి, వేద పండితుడు