ETV Bharat / state

మదనపల్లె దస్త్రాల దహనం కేసు- ఇద్దరు ఆర్డీఓలపై సస్పెన్షన్‌ వేటు - Madanapalle Fire Accident Case

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 8:00 PM IST

Madanapalle Sub Collector Fire Accident Case: మదనపల్లి దస్త్రాల దహనం కేసులో ముగ్గురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్​ను సస్పెండ్​ చేస్తూ ఆర్పీ సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు.

AP Politics 2024
Madanapalle Sub Collector Fire Accident Case (ETV Bharat)

Madanapalle Sub Collector Fire Accident Case : ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. పూర్వ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీన రాత్రి 11.30 గంటల సమయంలో మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

అగ్నిప్రమాదం, యాక్సిడెంట్ కాదని ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందని డీజీపీ ద్వారకా తిరుమల రావు అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులను పోలీసులు దశల వారీగా విచారిస్తున్నారు. ఈ తరుణంలో అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

"రెడ్​బుక్"​ ఇంకా తెరవలేదు- తెరిస్తే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా: మంత్రి లోకేశ్ - nara lokesh reacts on redbook

ఈ లైన్​మెన్​కు హ్యాట్సాఫ్​ చెప్పాల్సిందే - తాడుపై నడుస్తూ వాగు దాటి - విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించి - LINEMAN WALKING WIRES

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.